ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప ది రైజ్`. స్టార్ డైరెక్టర్ సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ వసూళ్ల సునామీని సృష్టించింది. ఏకంగా 300 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి ఉత్తరాదిలో సంచలనం సృష్టించింది. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఈ మూవీ ఉత్తరాదిలో రాబట్టిన వసూళ్లు ట్రేడ్ పండితుల్నే విస్మయానికి గురిచేశాయి.
ఉత్తరాదిలో బన్నీ నటించిన డబ్బింగ్ చిత్రాలకు అనూహ్య మైన ఆదరణ లభించడంతో అది `పుష్ప`కు బాగా ప్లస్ అయింది. ఈ కారణంగానే ఉత్తరాదిలో ఈ చిత్రం ఏకంగా 100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టడం సంచలనం గా మారింది. ఇదిలా వుంటే ఈ చిత్రానికి తాజాగా అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల ప్రకటించిన అవార్డుల్లో `పుష్ప` మూవీ ఆఫ్ ది ఇయర్ అవార్డుని దక్కించుకుంది. `దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డ్స్ 2022 లో బన్నీ `పుష్ప`కు మూవీ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కడం విశేషం.
బన్నీ వన్ మ్యాన్ షోగా రూపొందిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.`పుష్ప`కు లభించిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుంటే `దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డ్ చాలా చిన్నదే అయినా ఈ మూవీకి తొలి అవార్డు దక్కడంతో టీమ్ అంతా ఇదే బిగ్ అవార్డుగా భావిస్తున్నారట. అంతే కాకుండా ఈ మూవీకి రానున్న రోజుల్లో భారీ స్థాయిలో అవార్డు లు క్యూ కట్టడం ఖాయమని, దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డ్ తో `పుష్ప` అవార్డుల వేట మొదలైందని చెబుతున్నట్టుగా తెలుస్తోంది.
`పుష్ప`తో పాటు పలు చిత్రాలు కూడా అవార్డుల్ని దక్కించుకున్నాయి. `83` చిత్రంలో నటనకు గానూ బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ఉత్తమ నటుడిగా అవార్డుని దక్కించుకోగా `మిమీ` చిత్రానికి గానూ కృతి సనన్ ఉత్తమ నటిగా అవార్డుని సొంతం చేసుకుంది. క్రిటిక్స్ బెస్ట్ ఫిల్మ్ గా `సర్వార్ ఉద్ధమ్ సింగ్`.. ఉత్తమ చిత్రంగా షేర్షా ..అవార్డులు అందుకున్నాయి. ఈ అవార్డుల్లో సిద్ధార్ధ్ మల్హోత్రా , కియారా అద్వానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ప్రేమలో వున్నారంటూ ప్రచారం జరుగుతున్న ఈ ఇద్దరు స్టార్స్ వరుసగా క్రిటిక్స్ ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డుల్ని అందుకున్నారు. మనోజ్ బాజ్ పాయ్ కి వెబ్ సిరీస్ `ఫ్యామిలీ మ్యాన్ 2` కు గానూ ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. రవీనా టాండన్ ఉత్తమ నటిగా ఎంపికైంది. `దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డ్స్ 2022 వేడుక ఆదివారం రాత్రి ముంబైలో ఘనంగా జరిగింది.