శివ‌రాత్రి త‌రువాత ఇండ‌స్ట్రీకి గుడ్ న్యూస్

Update: 2022-02-28 06:45 GMT
టాలీవుడ్ ఇండ‌స్ట్రీ గ‌త కొన్ని నెల‌లుగా ఏపీలో టికెట్ ధ‌ర‌ల విష‌యంలో తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌ధాన స‌మ‌స్య కార‌ణంగా ఇప్ప‌టికే విడుద‌లైన‌ ప‌లు భారీ చిత్రాలు న‌ష్టాల‌ని చ‌విచూశాయి. దీంతో ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి, స్టార్ హీరోలు సూప‌ర్ స్టార్ మహేష్ బాబు - పాన్ ఇండియా సస్టార్ ప్రభాస్ - స్టార్ డైరెక్ట‌ర్స్ రాజ‌మౌళి - కొర‌టాల శివ - ఆర్ . నారాయ‌ణమూర్తి త‌దిత‌రులు ప్ర‌త్ంయేకంగా ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తో భేటీ అయ్యారు. ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల‌కు ఇక శుభం కార్డు ప‌డిన‌ట్టే అంటూ మీడియా ముందుకు వ‌చ్చి ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

ఇక రేపో మాపో ట‌కెట్ రేట్ల పెంపుద‌ల‌పై జీవో విడుద‌ల అవుతుందంటూ వార్త‌లు విన‌పించాయి. అయితే ప్ర‌భుత్వం సైడ్ నుంచి ఎలాంటి కద‌లిక క‌నిపించ‌లేదు. అంతే కాకుండా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ న‌టించిన `భీమ్లా నాయ‌క్‌` రిలీజ్ ముందు కొత్త నిబంధ‌న‌ల్ని అమ‌ల్లోకి తీసుకొచ్చారు. థియేట‌ర్ల వ‌ద్ధ రెవెన్యూ డిపార్ట్ మెంట్ కి సంబంధించిన అధికారుల్ని మోహ‌రించి ప్ర‌తీ థియేట‌ర్ల‌లో టికెట్ అమ్మకాల‌పై నిఘా పెట్టారు. ఈ ప‌రిణామాల కార‌ణంగా ఏపీ ప్ర‌భుత్వం ప‌లు విమ‌ర్శ‌ల‌కు గురైంది. సినీ ప్రియుల‌తో పాటు అభిమానులు, ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఏపీ ప్ర‌భుత్వం పై ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ని సంత‌రించుకుంది.

ఇదిలా వుంటే ఏపీ ప్ర‌భుత్వం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు శుభ వార్త చెప్ప‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టుగా వార్త‌లు విపిస్తున్నాయి. గ‌త కొంత కాలంగా టికెట్ రేట్ల‌కు సంబంధించిన జీవోని స‌వ‌రించ‌కుండా పెద్ద చిత్రాల‌కు ఇబ్బందులు క‌లిగిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ జీవోలో మార్పులు చేసి టికెట్ రేట్ల ని పెంచుకునే విధంగా ఏపి ప్ర‌భుత్వం ఓ జీవోని విడుద‌ల చేయ‌బోతోంద‌ని తెలిసింది. స‌ద‌రు జీవోని శివ‌రాత్రి త‌రువాత విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌.

ఇది త్వ‌రలో రానున్న రాధేశ్యామ్ - ఆర్ ఆర్ ఆర్ - ఆచార్య  చిత్రాల‌కు అడ్వాంటేజ్ గా మార‌నుంది. టికెట్ రేట్ల విధానం కార‌ణంగా ఏపీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన `భీమ్లానాయ‌క్‌` తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంది. ఈ మూవీ రిలీజ్ కి ముందు ఏపీ టికెట్ ల వ్య‌వ‌హారంపై ప్ర‌భుత్వం జారీ చేసిన జీవోని స‌వ‌రించి  ప్ర‌త్యేక షోలకు అనుమ‌తి ఇచ్చి వుంటే `భీమ్లా నాయ‌క్‌` టాలీవుడ్ చిత్రాల్లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన చిత్రంగా రికార్డు సృష్టించేది. అయినా ఇప్ప‌టికీ భీమ్లా క్రేజ్ ఎక్క‌డా త‌గ్గ‌లేదు. సండే భారీగా వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది.

`భీమ్లానాయ‌క్‌` త‌రువాత శ‌ర్వానంద్ `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు` రాబోతోంది. వ‌చ్చే శుక్ర‌వారం ఈ మూవీ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌డానికి రెడీగా వుంది. దీని త‌రువాత మార్చి టు మే సినిమాల జాత‌ర మొద‌టు కాబోతోంది. పాండ‌మిక్ త‌రువాత టాలీవుడ్ లో మార్చి నుంచి మే వ‌ర‌కు జరుగుతున్న సినిమాల జాత‌ర‌గా ఈ సీజ‌న్ ని ప్ర‌త్యేకంగా చెప్పుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఏపీ ప్ర‌భుత్వం రిలీజ్ చేయ‌బోయే జీఓ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికైనా ఏపి ప్ర‌భుత్వం ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల‌కు శుభం కార్డు వేస్తుంద‌ని అంతా ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.
Tags:    

Similar News