లవ్‌ స్టోరీకి ఒక మంచి అవకాశం చేజారింది

Update: 2021-09-11 07:30 GMT
కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా ఉంది. థియేటర్లు మూత పడటంతో కొన్ని వందల సినిమాలు విడుదల కోసం వెయిట్‌ చేస్తున్నాయి. కొన్ని చిన్నా పెద్ద సినిమాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. హిందీ సినిమాల పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. ఉత్తరాది ఇండస్ట్రీలతో పోల్చితే తెలుగు సినిమా పరిశ్రమ చాలా బెటర్ గా ఉంది. గత ఏడాది చివర్లో థియేటర్లు పునః ప్రారంభం అవ్వగా ఈ ఏడాది మార్చి వరకు చాలా సినిమాలే వచ్చాయి. సెకండ్‌ వేవ్ తర్వాత ఆగస్టు నుండి సినిమాలను వరుసగా విడుదల చేస్తున్నారు. ఈ నెలలో పెద్ద సినిమాలు వరుసగా ఉంటాయని అంతా ఆశించారు. కాని ఇంకా కరోనా భయం ఉందని కొన్ని సినిమాలు వెనుకంజ వేశాయి. కొన్ని సినిమాలు మాత్రం పర్వాలేదు అన్నట్లుగా ముందుకు వచ్చాయి. నిన్న  వినాయక చవితి సందర్బంగా గోపీచంద్ నటించిన సిటీమార్ విడుదల అయ్యింది. ఆ సినిమా కు మంచి రెస్పాన్స్ దక్కింది. పండుగ అవ్వడంతో పాటు సినిమాకు రెస్పాన్స్ దక్కడం వల్ల సినిమా థియేటర్ల వద్ద జనాలు క్యూ కట్టారు.

పండుగతో పాటు వీకెండ్ అవ్వడం వల్ల సినిమాకు వరుసగా మూడు రోజులు భారీ ఎత్తున వసూళ్లు నమోదు అవుతాయని.. మొదటి మూడు నాలుగు రోజుల్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం ఖాయం అంటూ ట్రేడ్ విశ్లేషకులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో లవ్ స్టోరీ వచ్చి ఉన్నా కూడా మంచి వసూళ్లు నమోదు అయ్యేవి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్‌ 10న రాబోతున్నట్లుగా ప్రకటించి ఆ తర్వాత తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడం జరిగింది. కరోనా భయంతో పాటు ఏపీలో థియేటర్ల వద్ద ఆంక్షలు మరియు టికెట్ల రేట్ల కారణంగా సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈనెల 24న థియేటర్లలో లవ్‌ స్టోరీ ఫిదా చేయబోతుంది.

లవ్ స్టోరీ సినిమాను వినాయక చవితి సందర్బంగా విడుదల చేయడం వల్ల మంచి ఫలితం ఉండేదని.. మంచి అవకాశంను మేకర్స్ వదులుకున్నారు.. ఆ అవకాశం సిటీమార్‌ కు కలిసి వచ్చిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  ఒక వేళ లవ్‌ స్టోరీ కూడా నిన్ననే విడుదల అయ్యి ఉంటే ఖచ్చితంగా సిటీమార్ కు ఈ స్థాయిలో రెస్పాన్స్ మరియు వసూళ్లు ఉండేవి కావేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం లవ్‌ స్టోరీ వదులుకున్న అదృష్టంను సిటీమార్ దక్కించుకుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సెప్టెంబర్‌ 24వ తారీకున రాబోతున్న లవ్‌ స్టోరీకి ప్రత్యేక రోజులు కాని సెలవులు కాని ఏమీ లేవు. కనుక దసరా కానుకగా అయినా విడుదల చేసి ఉంటే బాగుండేది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని దసరాకు పలు సినిమాలు లైనప్ ఉన్నాయి. ఆ పోటీ బదులుగా ముందే సినిమాను విడుదల చేయడం వల్ల రిస్క్ తక్కువ అనే అభిప్రాయంతో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఫిదా తర్వాత శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇదే అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా ఫిదా సినిమాలో నటించిన సాయి పల్లవి ఈ సినిమాలో నటించడం వల్ల కూడా అంచనాలు మరింతగా పెరిగాయి. సినిమాలో హీరోయిన్‌ మరియు హీరో మద్య ఉండే సన్నివేశాలను మరియు లవ్‌ సీన్స్ ను చాలా నాచురల్‌ గా తెరకెక్కించే దర్శకుడు శేఖర్‌ కమ్ముల. అందుకే సినిమా లో ఇద్దరి మద్య సాగే సన్నివేశాలు అద్బుతంగా ఉంటాయని.. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా సినిమా ఉంటుంది అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. అందుకే సినిమాను మంచి టైమ్‌ చూసి విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఆలస్యం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రెండు లేదా మూడు వారాలు కాస్త మంచి టైమ్ లభిస్తే సినిమా ఖచ్చితంగా వంద కోట్లకు మించి వసూళ్లను దక్కించుకుంటుంది అనే నమ్మకంను అక్కినేని అభిమానులు అంటున్నారు.
Tags:    

Similar News