అడివి శేష్ హీరో గా శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన 'గూఢచారి' బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా 'గూఢచారి' సినిమా హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉందని మెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానుంది.
హీరో అడివి శేష్ ఈరోజు(డిసెంబర్ 17) తన పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా 'గూఢచారి 2' సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు రాహుల్ పాకాల దర్శకత్వం వహిస్తాడు. రాహుల్ 'గూఢచారి' సినిమాకు అసిస్టెంట్ గా పని చేశాడు. మొదటి పార్ట్ భారీ విజయం సొంతం చేసుకోవడంతో సీక్వెల్ కు మరింత ఎక్కువ బడ్జెట్ తో భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్లానింగ్ జరుగుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2019 సమ్మర్ లో ప్రారంభిస్తారని 2020 విడుదల చేసే ప్లానింగ్ లో ఉన్నారని సమాచారం.
'గూఢచారి' రిలీజ్ సమయంలోనే ఈ సినిమాను ఫ్రాంచైజీ లా ముందుకు తీసుకెళ్తామని.. ఒక సీక్వెల్ తో ఆపకుండా రెండు మూడు సీక్వెల్స్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నామని అడివి శేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. హాలీవుడ్ లో జేమ్స్ బాండ్ సీరీస్ లాగా మనకు టాలీవుడ్ లో గూఢచారి సీరీస్ అన్నమాట. ప్రస్తుతానికి త్రినేత్ర 116 టీమ్ తమ రెండో మిషన్ కు రెడీ.