మన మ్యూజిక్‌ లో ఎంట‌ర్ ది డ్రాగ‌న్‌

Update: 2015-09-15 11:30 GMT
ప్ర‌తిభ ఉండాలే కానీ, ప్రాంతం - భాష‌ - కులం - మ‌తం ఇవేవీ అడ్డంకులు కాబోవు. పొరుగు భాష‌ల‌కు చెందిన వారికైనా తెలుగులో ఆద‌ర‌ణ ద‌క్కుతుంది.  న‌ట‌న‌ - కెమెరా - ద‌ర్శ‌క‌త్వం - సంగీతం .. ఇలా అన్ని విభాగాల్లోనూ ఇక్క‌డ చోటుంటుంది. నిరూపించుకున్న‌వారికి అవ‌కాశాల‌కు కొదువ ఉండ‌దిక్క‌డ‌. ఆ త‌ర‌హాలోనే త‌మ‌న్‌ - హ్యారిస్ జైరాజ్‌ - యువ‌న్ శంక‌ర్ రాజా లాంటి సంగీత ద‌ర్శ‌కులు పొరుగు నుంచి వ‌చ్చినా మ‌న‌వాళ్లు ప‌ట్టం గ‌ట్టారు. 
         
ఇప్పుడు లేటెస్టుగా టాలీవుడ్‌ లో మ‌ల‌యాళ సంగీత‌ద‌ర్శ‌కుడు గోపీ సుంద‌ర్ హ‌వా సాగుతుంద‌ని చెప్పుకుంటున్నారు. ఈ కుర్రాడు భ‌లే భ‌లే మ‌గాడివోయ్ చిత్రంతో పెద్ద స‌క్సెస్ అందుకున్నాడు. అత‌డు అందించిన ట్యూన్స్ మ‌న శ్రోత‌ల‌కు విప‌రీతంగా న‌చ్చేశాయి. అంత‌కంటే ముందే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు పాట‌లు కూడా మ‌న‌వాళ్ల‌ను మెప్పించాయి. దాంతో అత‌డికి వెంట వెంట‌నే ఊపిరి స‌ల‌ప‌న‌న్ని అవ‌కాశాలొస్తున్నాయి. నాగార్జున‌ - కార్తీ హీరోలుగా వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కిస్తున్న  ఊపిరి చిత్రానికి గోపి సుంద‌ర్ ట్యూన్ లు ఇస్తున్నాడు. అలాగే రాజ్ త‌రుణ్ సినిమాకి  ప‌నిచేస్తున్నాడు.

నాగ్‌ - కార్తీ సినిమా రిలీజైతే ఆ సినిమా ఫ‌లితం చూసి ఇంకా అవ‌కాశాలు ఇవ్వ‌డానికి స్టార్ హీరోలంతా రెడీగా ఉన్నారు. అయితే ఈ అవ‌కాశాల‌న్నీ గోపి సుంద‌రికి ఓవ‌ర్‌ నైట్‌ లో వెంట‌ప‌డ‌లేదు. అత‌డు బెంగ‌ళూర్ డేస్‌ - ఉస్తాద్ హోట‌ల్ లాంటి సూప‌ర్ హిట్ సినిమాల‌కు సంగీతం అందించాడు. కెరీర్‌ లో ఎంతో కృషి దాగి ఉంది. స‌క్సెస్ వెంట వెంట‌నే వ‌చ్చింది. అందుకే ఇప్పుడు తెలుగు సినీప‌రివ్ర‌మ రెడ్‌ కార్పెట్ వేసి మ‌రీ ఆహ్వానించింది. అదీ సంగ‌తి.
Tags:    

Similar News