హీరోలంతా బ్యాక్ టు బ్యాక్ హిట్ లు, సూపర్ హిట్ లు.. పాన్ ఇండియా సక్సెస్ లతో దూసుకుపోతున్నారు. కొంత మంది హీరోలు కొత్త తరహా మూవీస్ తో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసుకుంటూ ఆ స్థాయి సినిమాలతో సిద్ధమవుతున్నారు. అయితే హీరో గోపీచంద్ మాత్రం ఇంకా ఈ రేసులో వెనకబడే వున్నారు. ఆయన హిట్టు మాట విని దాదాపు ఏడేళ్లవుతోంది. 'లౌక్యం' తరువాత ఆయన ఏడు సినిమాలు చేస్తే అందులో ఏ మూవీ కూడా హిట్ టాక్ ని సొంతం చేసుకోలేక పోయింది.
గత ఏడాది సంపత్ నంది డైరెక్షన్ లో నటించిన 'సీటీమార్' మూవీ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ ని రాబట్టింది. కానీ ఆ ఊపుని చివరి దాకా మెయింటైన్ చేయలేకపోయింది. కానీ హీరో గోపీచంద్ కు మాత్రం ఊరట కలిగించింది. అయితే గత ఏడేళ్లుగా ఆశించిన స్థాయి సక్సెస్ ని సొంతం చేసుకోలేక పోతున్న గోపీచంద్ ఈ సారి పక్కా అంటూ రెడీ అవుతున్నాడు. ఈ సారి పక్కా హిట్ కొట్టడం ఆయనకు చాలా అవసరం. ఇదే ఆయన కెరీర్ ని ప్రభావింతం చేసే సినిమాగా మారబోతోంది.
ప్రస్తుతం ఆయన నటించిన తాజా చిత్రం 'పక్కా కమర్షియల్' మూవీపై అందరి దృష్టి పడింది. మారుతి డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేషన్స్ పై బన్నీవాసు ఈ సినిమాని నిర్మించారు.పేరుకు తగ్గట్టే పక్కా కమర్షియల్ అంశాలతో కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని దర్శకుడు మారుతి తెరకెక్కించారు. రాశిఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ జూలై 1న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ ని ప్రారంభించింది.
ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేస్తోంది. హీరో గోపీచంద్ పాత్రని మారుతి మలిచిన తీరు, రాశిఖన్నా - గోపీచంద్ ల మధ్య కుదిరిన కెమిస్ట్రీ, సత్యరాజ్ - గోపీచంద్ ల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. యువీ, గీతా ఆర్ట్స్ 2.
ఈ రెండూ పేరున్న సంస్థలు కావడం, పబ్లిసిటీని భారీగా ప్లాన్ చేయడం కూడా గోపీచంద్ కు బాగా కలిసి వచ్చే అంశం. ఇక మూవీ ఔట్ పుట్ కూడా బాగా వచ్చిందని, ఈ సారి గోపీచంద్ పేరుకు తగ్గట్టే పక్కా కమర్షియల్ హిట్ ని సొంతం చేసుకోబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
అదే జరిగితే హీరో గోపీచంద్ కెరీర్ మళ్లీ పట్టాలెక్కడం ఖాయం అని, ఈ సినిమా ఆయన కెరీర్ ని మరో మలుపు తిప్పుతుందని చెబుతున్నారు. గోపీచంద్ కూడా ఏడేళ్లు..ఏడు సినిమాల ఫ్లాపుల తరువాత ఈ మూవీతో పక్కా కమర్షియల్ హిట్ ని అందుకోబోతున్నాననే కాన్ఫిడెన్స్ తో వున్నారట. ఆయన నమ్మకం ఏ స్థాయిలో నిజమవుతుందో తెలియాలంటే జూలై 1 వరకు వేచి చూడాల్సిందే.