మరోసారి తండ్రైన గోపీచంద్‌

Update: 2018-09-13 07:03 GMT
మాస్‌ హీరో గోపీచంద్‌ వినాయక చవితి రోజైన నేడు తెల్లవారు జామున 5.40 కు మరోసారి తండ్రి అయ్యాడు. గోపీచంద్‌ భార్య రేష్మ ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌ లో బాబుకు జన్మనిచ్చినట్లుగా కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. గోపీచంద్‌ రెండవ సారి తండ్రి అవ్వడంతో ఆనందంగా ఉన్నాడు. పండుగ రోజున బాబు పుట్టడంతో గోపీచంద్‌ కుటుంబంలో ఆనందం వెళ్లివిరుస్తుంది.

గోపీచంద్‌ - రేష్మలకు మే 12 - 2013న వివాహం జరిగిన విషయం తెల్సిందే. వీరి వివాహం అయిన తదుపరి సంవత్సరంలో అంటే అక్టోబర్‌ 13 - 2014న మొదటి బాబుకు రేష్మ జన్మనిచ్చింది. మొదటి బాబుకు విరాట్‌ కృష్ణ అంటూ తన తండ్రి పేరును గోపీచంద్‌ పెట్టుకున్నాడు. విరాట్‌ తన జీవితంలోకి ఎంటర్‌ అయిన తర్వాత చాలా మారిపోయాను, జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి అంటూ పలు ఇంటర్వ్యూలో గోపీచంద్‌ చెప్పుకొచ్చాడు.

విరాట్‌ కృష్ణతో హాయిగా జీవితాన్ని గడిపేస్తున్న గోపీచంద్‌కు మరో కొడుకు రావడంతో మరింత సంతోషం ఆయన జీవితంలోకి వచ్చినట్లయ్యింది. గోపీచంద్‌ భార్య రేష్మ ప్రముఖ తెలుగు హీరో శ్రీకాంత్‌ కు దగ్గరి బందువు అనే విషయం తెల్సిందే. స్వయంగా శ్రీకాంత్‌ వీరి వివాహంను ముందుండి జరిపించడం జరిగింది. గోపీచంద్‌ రెండవ సారి తండ్రి అయిన సందర్బంగా సోషల్‌ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి.

Tags:    

Similar News