గతేడాది రెండు సినిమాలు రిలీజ్ చేసి గోపీచంద్ ఫామ్ లోకి వచ్చేశాడని అనుకుంటే.. ఈ ఏడాది మళ్లీ స్లో అయిపోయాడు. ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా రాలేదు సరికదా.. చేస్తున్న రెండు సినిమాలు ఏదో ఒక సమస్యలో ఇరుక్కుంటూనే ఉన్నాయి. బీ గోపాల్ దర్శకత్వంలో సినిమా ఓసారి ఆగిపోయి.. తిరిగి మొదలయ్యి.. డిసెంబర్ లో రిలీజ్ కు సిద్ధమవుతోంది.
ఇప్పుడు ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న ఆక్సిజన్ పరిస్థితి కూడా అగమ్యగోచరంగానే ఉందని అంటున్నారు. కొన్ని సీన్స్ విషయంలో హీరో-దర్శకుడు ఇద్దరికీ తీవ్రమైన విబేధాలు వచ్చాయట. దీంతో ఇద్దరూ అసలు ఫేస్ టు ఫేస్ ఎదురుపడ్డానికి గానీ.. మాట్లాడుకోవడానికి ఇష్టపడ్డం లేదని అంటున్నారు. ఇంతటి విబేధాలు తలెత్తడంతో.. సినిమా షూటింగ్ హోల్డ్ లో పెట్టేయాల్సి వచ్చింది. దర్శకుడు ఏఎం జ్యోతికృష్ణ తండ్రి.. బడా నిర్మాత ఏఎం రత్నం నిర్మాత కావడంతో.. ఆయన ఎవరికి సర్ది చెప్పాలో అర్ధం కాని సంకట పరిస్థితిలో పడిపోయాడని అంటున్నారు.
ముందుగా ప్లాన్ చేసిన ప్రకారం అయితే.. అక్టోబర్ లోనే ఆక్సిజన్ థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ అసలు ఎప్పుడొస్తుందో తెలీని పరిస్థితిలో పడిపోయిందట. మరోవైపు గోపీచంద్ కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా.. సంపత్ నంది సినిమాపైనే దృష్టి పెడుతున్నాడని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/