ముకుంద లాంటి భిన్నమైన సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన మెగా కుర్రాడు వరుణ్ తేజ్.. రెండో ప్రయత్నంలోనూ కంచె లాంటి ప్రయోగాత్మక సినిమా చేసి ఆశ్చర్యపరిచాడు. ఐతే పూరి జగన్నాథ్ సినిమాతో కమర్షియల్ లీగ్ లోకి అడుగుపెడుతున్నాడు వరుణ్. దీని తర్వాత అతను కమర్షియల్ విలువలున్న ఓ ప్రయోగాత్మక సినిమా చేయబోతున్నట్లు సమాచారం. బలుపు, పండగ చేస్కో సినిమాలతో రెండు వరుస హిట్లు కొట్టిన యువ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వరుణ్ నటించబోతున్నట్లు తెలిసింది.
ఇప్పటిదాకా రొటీన్ సినిమాలే చేసిన గోపీచంద్.. ఈసారి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ విభిన్నమైన సినిమా చేయబోతున్నాడట. ఐతే కమర్షియల్ విలువలకు కూడా ఏమీ ఢోకా ఉండదట. స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమా కాబట్టి దానికి ఆరడుగుల ఆజానుభాహుడైన వరుణ్ అయితే బాగా సూటవుతాడని అతణ్ని అడగడం.. అతను ఓకే చెప్పడం అయిపో్యాయట. ముకుంద సినిమాతో వరుణ్ ను హీరోగా పరిచయం చేసిన నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధులే ఈ సినిమాను నిర్మించబోతున్నారు. మురుగదాస్ కథతో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా మొదలుపెట్టడానికి గోపీచంద్ ప్రయత్నాలు చేశాడు కానీ.. అది ఎందుకో వర్కవుట్ కాలేదు. ‘నాన్నకు ప్రేమతో’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించడానికి ఎన్టీఆర్ పచ్చజెండా ఊపేయడంతో గోపీతో సినిమా ఉండదని తేలిపోయింది. ఈ నేపథ్యంలోనే అతను వరుణ్ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.