'డాన్ శీను' సినిమాతో డైరక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన గోపిచంద్ మలినేని.. ఆ తరువాత అన్నీ రొటీన్ సినిమాలే తీశాడు. 'బాడీగార్డ్' అనే మలయాళ రీమేక్ చేసినా.. అదీ యావరేజ్ గానే ఆడింది. రవితేజ తో తీసిన 'బలుపు' సినిమా పర్లేదు. ఇక మొన్న వచ్చిన 'పండగ చేస్కో' అయితే వీర రొటీన్. అందుకే ఈ మధ్యకాలంలో మనోడు రాసిన కథను బన్నీ, -జూ.ఎన్టీఆర్ - రామ్ చరణ్ వంటి స్టార్లందరూ రిజక్టు చేశారు. స్వయంగా ఏ.ఆర్.మురుగదాస్ కథ రాసిచ్చినా కూడా.. గోపికి మాత్రం పెద్ద హీరోలు సినిమా ఇవ్వలేదు.
చివరకు దిల్ రాజు క్యాంపులో చేద్దాం అనుకున్న సినిమాను పక్కనెట్టేసి.. సాయిధరమ్ తేజ్ తో నల్లమలుపు బుజ్జి ప్రొడక్షన్ లో ఒక సినిమాను మొదలు పెట్టాడు. నిన్న సాయంత్రమే ఈ సినిమా కూడా లాంచ్ అయ్యింది. రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో హీరోయిన్. అయితే ఎప్పుడూ కేవలం బిల్డప్ షాట్లతో కూడిన హీరోయిజం.. ఫైట్లు.. కొన్ని కామెడీ సీన్లపైనే ఆధారపడుతున్న గోపిచంద్ మలినేని.. ఈసారైనా కొత్త ఏదన్నా ప్రయత్నిస్తున్నాడా లేదా అనేది ఇప్పుడు చూడాల్సిన విషయం. ఎందుకంటే ఆల్రెడీ ఇదే బాటలో ఏ.ఎస్.రవికుమార్ చౌదరి.. శ్రీవాస్.. సంతోష్ శ్రీనివాస్.. వంటి దర్శకులందరూ ప్రయాణిస్తున్నారు. కాని ఆ రూటులో ఏదొచ్చినా కూడా ఆడియన్స్ మాత్రం రిజక్టు చేస్తున్నారు.
గోపిచంద్ మాత్రం.. ఈ సినిమా స్క్రిప్టు ఎంతో అద్భుతంగా వచ్చిందని.. ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిలిం అని.. ఆడియన్స్ ఎంతో థ్రిల్ కు గురవుతారని అంటున్నాడు. ఇంతకీ అప్పట్లో బన్నీ అండ్ ఎన్టీఆర్ లకు చెప్పిన కథేనా ఇది.. లేకపోతే కొత్తదా?