సాయిధరమ్ తేజ్ తో ‘విన్నర్’ సినిమా చేయడం మరపురాని అనుభవమని అన్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. తేజుతో పని చేస్తుంటే మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లతో పని చేసిన ఫీలింగ్ కలిగిందని.. అతడిలో మావయ్యల పోలికలు ఆ స్థాయిలో ఉన్నాయని గోపీచంద్ చెప్పాడు. ‘విన్నర్’ ఆడియో వేడుకలో గోపీచంద్ ఇంకా ఏమన్నాడంటే..
‘‘విన్నర్ షూటింగ్ మొదలైన కొన్ని రోజులకు మానిటర్లో తేజును చూస్తుంటే నాకు చిరంజీవి గారిని.. పవన్ కళ్యాణ్ గారిని మార్చి మార్చి చూస్తున్నట్లు అనిపించేది. వాళ్లతోనే సినిమా చేస్తున్నట్లు ఫీలయ్యేవాడిని. ఈ సినిమా కోసం తేజు ఎంత కష్టపడ్డాడో మాటల్లో చెప్పలేను. విలన్ గా చేసిన అనూప్ సింగ్ అద్భుతమైన హార్స్ రైడర్. మరి విలనే అలా చేశాడంటే హీరో ఎలా చేసి ఉంటాడో అంచనా వేయొచ్చు. అతను గుర్రం ఎక్కితే మాకు టెన్షన్ గా ఉండేది. ఒక పిల్లాడిని చూసుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాం. ఒకసారి గుర్రం మీది నుంచి కింద పడ్డాడు. కంగారు పడి వెళ్తే.. నాకేం కాలేదన్నా అంటూ లేచి వచ్చేశాడు. ఈ సినిమా మొదలైనపుడే తేజు వాళ్ల అమ్మకు ఒక మాట చెప్పాలనుకున్నా. ఈ సినిమా తర్వాత తేజు రేంజ్ మారిపోతుంది. కమర్షియల్ గా పెద్ద రేంజికి వెళ్తాడు. ఇప్పుడు ఆ విషయం చెబుతున్నా. ఛోటా కే నాయుడి గారితో పని చేయాలని ఎప్పట్నుంచో కోరుకుంటున్నా. నా తొలి సినిమాకు అడిగితే.. ‘బృందావనం’ చేస్తున్నా అన్నారు. ఆ తర్వాత ప్రతి సినిమాకూ ఆయన్ని అడుగుతూనే ఉన్నా. ఏదో ఒక ప్రాజెక్టులో బిజీగా ఉంటున్నారు. ఎట్టకేలకు ఆయనతో సినిమా చేసే అవకాశం లభించింది. ఆయన వల్లే ఈ సినిమా ఇంత రిచ్ గా వచ్చింది. విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. నిర్మాతలు అసలేమాత్రం రాజీ పడలేదు. నేను కోరినట్లే పెద్ద పెద్ద టెక్నీషియన్లను ఇచ్చారు. విన్నర్ కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది’’ అని గోపీచంద్ అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/