గోపీకి ఆ మోజు తీరలేదే..

Update: 2018-01-06 16:33 GMT
టాలీవుడ్లో చాలా మందికి రకరకాల సెంటిమెంట్లుంటాయి. హీరో గోపీచంద్‌కు కూడా ఒక సెంటిమెంటుంది. తన సినిమాలకు రెండక్షరాల టైటిల్స్ పెట్టుకుని.. అందులో పేరు చివర ‘సున్నా’ పెట్టుకోవడం అతడికి అలవాటు. అతడికి హీరోగా తొలి విజయాన్నందించిన ‘యజ్ఞం’ దగ్గర్నుంచి ఈ సెంటిమెంటు కొనసాగుతోంది. రణం.. శౌర్యం.. శంఖం.. లౌక్యం.. సౌఖ్యం.. ఇలా గోపీ కెరీర్లో మెజారిటీ సినిమాలు ఈ సెంటిమెంటును ఫాలో అయినవే. చివరగా ఈ సెంటిమెంటును ఫాలో అయిన ‘సౌఖ్యం’ డిజాస్టర్ అయినా సరే.. గోపీ దీన్ని విడిచిపెట్టలేదు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న తన కొత్త సినిమాకు కూడా గోపీ ఇదే సెంటిమెంటును కొనసాగిస్తున్నట్లు సమాచారం.

చక్రి అనే కొత్త దర్శకుడితో గోపీచంద్ ఈ మధ్యే ఒక సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ‘పంతం’ అనే టైటిల్ ఖరారు చేస్తున్నారట. ఇప్పటికే ఈ టైటిల్ రిజిస్టర్ కూడా చేయించినట్లు సమాచారం. ‘జై లవకుశ’తో పాటు మరికొన్ని పెద్ద సినిమాలకు రచయితగా పని చేశాడు చక్రి. ఈ మధ్య గోపీ నమ్ముకున్న దర్శకులందరూ అతడికి పెద్ద పెద్ద షాకులిస్తున్నారు. దీంతో ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్లను వదిలేసి కొత్త దర్శకుడిపై నమ్మకం పెట్టుకున్నాడు గోపీ. ఇప్పుడు చేస్తున్నది గోపీచంద్ 25వ సినిమా కావడం విశేషం. ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టును కొత్త దర్శకుడి చేతిలో పెట్టాడు. వరుస ఫ్లాపుల్లో పడి కొట్టుమిట్టాడుతున్న గోపీకి ఈ సినిమా సక్సెస్ చాలా చాలా అవసరం. మరి చక్రి ఏం చేస్తాడో చూడాలి.
Tags:    

Similar News