రిలీజ్ నా చేతుల్లో లేదు కదా..

Update: 2017-11-28 04:18 GMT
కొన్నిసార్లు అంతే.. మన చేతుల్లో ఏమీ లేదు. మనం చేయగలిగిందేం లేదని ఓ రకమైన నిస్సహాయత ఆవరించేస్తోంది. ఇండస్ట్రీలో ప్రస్తుతం కాలం కలిసిరాక సతమతమవుతున్న హీరో గోపీచంద్ అదే మాట అంటున్నాడు. గోపీచంద్ సినిమా హిట్టు.. ఫ్లాపు సంగతి పక్కనపెట్టి రిలీజ్ అవడమే ఓ గొప్ప విజయంగా భావించాల్సిన పరిస్థితి నడుస్తోందిప్పుడు. అతడు హీరోగా నటించి సుదీర్ఘ కాలం ప్రేక్షకుల ముందుకు రాకుండా ఉండిపోయిన ఆక్సిజన్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

శ్రీవాస్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన లౌక్యం సూపర్ హిట్టయింది. ఆ తరవాత గోపీచంద్ ను పరాజయాలే వరసగా పలకరించాయి. లౌక్యం తరవాత సౌఖ్యం సినిమా చేయడం తన కెరీర్ లో వేసిన రాంగ్ స్టెప్ అంటున్నాడు. అక్కడి నుంచి కెరీర్ బ్యాడ్ టర్న్ తీసుకుందని ఓపెన్ గానే చెప్పుకొచ్చాడు. బి.గోపాల్ దర్శకత్వంలో నటించిన ఆరడుగుల బుల్లెట్ సినిమా ఎప్పుడూ షూటింగ్ పూర్తయి రిలీజ్ కాలేదు. ఆమధ్య రిలీజ్ అవడానికి అంతా సిద్దం చేసినా చివరకు విడుదల కాకుండా ఆగిపోయింది. దీనిపై మాట్లాడుతూ ‘‘సినిమాల్లో నటించడం వరకే నా పని. రిలీజ్ డేట్ అనేది నా చేతుల్లో లేదంటూ’’ చేతులెత్తేశాడు.

లేటెస్ట్ గా వస్తున్న ఆక్సిజన్ సినిమా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తోపాటు మెసేజ్ ఓరియంటెడ్ గా ఉంటుందని.. ఈ సినిమా ప్రేక్షకులను నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాడు. ప్రస్తుతం తన మూడేళ్ల కొడుకు విరాట్ కృష్ణ ఆటపాటలను ఎంజాయ్ చేస్తున్నానని.. తన పర్సనల్ లైఫ్ లో ఇది బెస్ట్ ఫేస్ అని ఆనందంగా చెబుతున్నాడు తన కెరీర్ లో 25వ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్న గోపీచంద్.
Tags:    

Similar News