యాక్షన్ హీరో గోపీచంద్ కొన్ని వరుస వైఫల్యాల అనంతరం త్వరలో విడుదల కాబోతున్న స్పోర్ట్స్ డ్రామా సీటీమార్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో గోపిచంద్ కి ఇదే విషయమై ప్రశ్న ఎదురైంది.
గోపీ వరుస ఫ్లాపుల గురించి అడిగినప్పుడు.. తనకు సరైన స్క్రిప్ట్ రాలేదని గోపీచంద్ వెల్లడించాడు. అతను కచ్చితమైన స్క్రిప్ట్ ను కనుగొనలేకపోయానని.. తన అభిమానులను వేచి ఉండేలా చేయలేనని.. తాను ఎక్కువసేపు వేచి ఉండలేనని డిఫరెంట్ ఒపీనియన్ చెప్పాడు. ఈ ప్రక్రియలో అతను మరికొన్ని ఫ్లాప్ లను ఎదుర్కొన్నారట. నేను చేసిన కొన్ని ఫ్లాప్ సినిమాలు వాస్తవానికి విభిన్నమైన ఎలిమెంట్స్ ని కలిగి ఉన్నాయనే భావన తనకు ఉందని.. కానీ హిట్టు సినిమాగా మలచడంలో విఫలమయ్యామని కూడా అతను చెప్పాడు. కథగా బావున్నా విజువల్ గా బాలేదని అంగీకరించారు.
సీటీమార్ అనేది కబడ్డీ నేపథ్యంలో ఒక స్పోర్ట్స్ డ్రామా. గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ మహిళా కబడ్డీ జట్టు కోచ్ గా కనిపిస్తారు. మరోవైపు తెలంగాణ మహిళా కబడ్డీ జట్టు కోచ్ గా తమన్నా నటిస్తోంది. ఇందులో తమన్నా జ్వాలారెడ్డి అనే ఫైరింగ్ లేడీగా కనిపించనుంది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.