'సీటీమార్' ట్రైలర్: కబడ్డీ ఆట నేర్పిస్తూనే.. రౌడీలతో ఆడుకుంటున్న గోపీచంద్
డైనమిక్ హీరో గోపీచంద్ - మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కలిసి నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ''సీటీమార్''. కబడ్డీ ఆట నేపథ్యంలో డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని.. వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 10న వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా ట్రైలర్ ను ఉస్తాద్ హీరో రామ్ పొతినేని విడుదల చేసి చిత్ర బృందానికి విషెస్ అందించారు.
'సీటీమార్' లో గోపీచంద్ - తమన్నా ఫెంటాస్టిక్ గా ఉన్నారని.. ఇది కచ్చితంగా బిగ్ స్క్రీన్ ఎక్సపీరియన్స్ ఇచ్చే సినిమా అని రామ్ ట్వీట్ చేశారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. స్పోర్డ్స్ డ్రామా అయినప్పటికీ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా తీర్చిదిద్దినట్లు అర్థం అవుతుంది. 'రూల్స్ ప్రకారం పంపిస్తే ఆడి వస్తారు.. అదే రూట్ లెవల్ నుంచి ఆలోచించి పంపిస్తే పేపర్ లో వస్తారు' అని గోపీచంద్ చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. మహిళా క్రీడాకారులను ప్రోత్సహించాలనే సందేశాన్ని కూడా ఇందులో ఇమడ్చారు.
అమ్మాయిలు వేసుకునే బట్టలను బట్టి క్యారక్టర్ డిసైడ్ చేసే మనుషులకు ఎదురొడ్డి వాళ్ళని కబడ్డీ ప్లేయర్స్ గా ఎలా రెడీ చేసారు? జాతీయ స్థాయిలో ఎలా గుర్తింపు తెచ్చుకున్నారనేదే 'సీటీమార్' సినిమా. ఈ క్రమంలో భయంకరమైన విలన్స్ ని కూడా హీరో ఢీకొట్టబోతున్నట్లు ట్రైలర్ లో హింట్ ఇచ్చారు. గోపీచంద్ గత చిత్రాల తరహాలోనే ఇందులో కూడా భారీ యాక్షన్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 'ఆడపిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు కావాల్సింది మగాడి తోడు కాదు.. ధైర్యం అనే తోడు' 'సౌత్ కా సత్తా మార్ కే నహి.. సీటీమార్ కే గీకాయింగే' వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
'సీటీమార్' చిత్రంలో ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్ పాత్రలో గోపీచంద్.. తెలంగాణ మహిళల కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డి పాత్రలో తమన్నా కనిపిస్తున్నారు. భూమిక చావ్లా - దిగంగనా సూర్యవంశీ కీలక పాత్రలు పోషించగా.. రెహమాన్ - రావు రమేష్ - తరుణ్ అరోరా - పోసాని కృష్ణ మురళి - ప్రీతి ఆశ్రని - జబర్దస్త్ మహేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఇప్పుడు వచ్చిన యాక్షన్ ప్యాకెడ్ ట్రైలర్ కూడా ఆడియన్స్ ని అలరిస్తోంది.
అమ్మయిలకు కోర్టులో కబడ్డీ ఆడటం నేర్పించిన కోచ్.. బయట రౌడీలతో ఎలా ఆడుకున్నాడు అనేది తెలియాలంటే 'సీటీమార్' సినిమా చూడాల్సిందే. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చారు. సుందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందించగా.. తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేశారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘గౌతమ్‌నంద’ తర్వాత గోపీచంద్ - సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ''సీటీమార్'' పై అందరిలో ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా గోపీచంద్ ని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.
Full View