దుమ్ము రేపిన అక్కా చెల్లెళ్లు.. వ్వాటే లుక్!

Update: 2021-11-06 15:30 GMT
క‌పూర్ సిస్ట‌ర్స్ జాన్వీ క‌పూర్ - ఖుషీ క‌పూర్ ఏ వేడుక‌కు వెళ్లినా ముంబైలో ఎక్క‌డ ఉన్నా ఆ ఇద్ద‌రూ ఇటీవ‌ల షో స్టాప‌ర్స్ గా నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. జాన్వీ క‌పూర్ ఇప్ప‌టికే టాప్ హీరోయిన్ గా కెరీర్ ప‌రంగా దూసుకుపోతుండ‌గా ఖుషీ క‌పూర్ తెరంగేట్రానికి స‌న్నాహ‌కాల్లో ఉంది. ఆ క్ర‌మంలోనే సిస్ట‌ర్స్ లో న్యూ యాంగిల్ క‌నిపిస్తోంది. ఫోటోషూట్ల కోసం హాట్ కంటెంట్ ని ఎలివేట్ చేసేందుకు సిస్ట‌ర్స్ ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతుండ‌డం క‌నిపిస్తోంది.

జాన్వీ- ఖుషీ అల్ట్రా స్టైలిష్ లుక్ ల‌ను ఇన్ స్టా లో షేర్ చేస్తూ ఫాలోవ‌ర్స్ లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఇక ఈ భామ‌లు డిజైన‌ర్ లుక్ ఎంపిక‌లో.. అంద‌చందాల ఎలివేష‌న్ లో ప్యారిస్ హంస‌రాణుల‌కే మ‌తి చెదిరే ట్రీటిస్తున్నారు. ఇటీవలి దీపావళి వస్త్రధారణతోనూ మ‌రోసారి హాట్ టాపిక్ గా మారారు. దీవాళీ రోజునే ఖుషీ కపూర్ తన 21వ పుట్టినరోజును జరుపుకుంది. ఆమె సోదరి జాన్వీ తన `టోట‌ల్ వ‌ర‌ల్డ్`అయ‌న ఖుషీకి అద్భుతమైన ఫోటోతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ జంట పింక్ షేడ్స్ లో అందంగా కనిపించారు! ఖుషీ సోద‌రి జాన్వీ కపూర్ తన హాట్ పింక్ బాడీకాన్ డ్రెస్ తో మైమ‌రిపించింది. జాన్వీ ఈ లుక్ లో అద్భుతంగా కనిపించింది.

ఖుషీ క‌పూర్ బేబీ పింక్ కలర్ లో చిక్ కార్సెట్ డ్రెస్ ని ఎంచుకుంది. స్కిన్-హగ్గింగ్ శాటిన్ ఫ్యాబ్రిక్ కౌల్ నెక్ - నూడిల్ స్ట్రాప్ స్లీవ్ లతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించింది. ఆమె కార్సెట్ దుస్తులు ఉంగరాల జుట్టు స్పెష‌ల్ గా ఆక‌ర్షిస్తోంది. ఆమె తన సున్నితమైన గ్లామ్ మేకప్ ఎర్రటి పెదవులతో ఊరిస్తోంది. సోదరీమణుల ఆకట్టుకునే లుక్ అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. స్ప‌ష్ఠంగా పార్టీ మూడ్ ని పింక్ మ‌రింత‌గా రాజేసింద‌నే చెప్పాలి. జాన్వీ మ‌రోవైపు కెరీర్ ప‌రంగా పూర్తి బిజీగా ఉండ‌గా ఖుషీ క‌పూర్ డెబ్యూ సినిమాకి స‌న్నాహ‌కాల్లో ఉంది. తండ్రి బోనీ క‌పూర్ ఆ ఇద్ద‌రి కోసం అద్భుత ప్ర‌ణాళిక‌ల్ని ర‌చించిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News