'ఓంధ్ కథే హెల్లా' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన అందాల భామ ప్రియాంక అరుల్ మోహన్.. తెలుగు తమిళ చిత్రాల్లో అవకాశాలు అందుకుంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన నాని 'గ్యాంగ్ లీడర్' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
సినిమా ఆశించిన విజయాన్ని అందుకోనప్పటికీ అమ్మడి అందం మరియు క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే తెలుగులో శర్వానంద్ సరసన 'శ్రీకారం' చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది ప్రియాంక.
అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది కానీ.. సక్సెస్ మాత్రం రాలేదు. బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలు ప్లాప్ అవడంతో.. ఆ తర్వాత ప్రియాంక మోహన్ ను తెలుగు ఫిలిం మేకర్స్ ఎవరూ పట్టించుకోలేదు. కాకపోతే తమిళ చిత్ర పరిశ్రమ ఈ బ్యూటీకి గ్రాండ్ వెల్ కమ్ చెప్పి వరుస అవకాశాలు అందించింది.
వర్సటైల్ హీరో శివ కార్తికేయన్ నటించిన 'డాక్టర్' చిత్రంతో ఎంట్రీ కోలీవుడ్ లో అడుగుపెట్టింది ప్రియాంక. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. 'వరుణ్ డాక్టర్' పేరుతో తెలుగులోకి డబ్ కాబడి.. ఇక్కడ కూడా సక్సెస్ అందుకుంది.
దీంతో శివ కార్తికేయన్ వెంటనే 'డాన్' చిత్రంతో కుర్ర భామకు మరో అవకాశం ఇచ్చాడు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయింది. 'కాలేజ్ డాన్' గా తెలుగులోనూ పర్వాలేదనిపించుకుంది. ప్రియాంక మరోసారి ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది.
అయితే మధ్యలో స్టార్ హీరో సూర్య తో కలిసి చేసిన పాన్ ఇండియా మూవీ 'ET' (ఎదుర్కుమ్ తుణిందవన్) బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఇలా తమిళ్ లో రెండు హిట్లు ఒక ప్లాప్ అనే విధంగా ప్రియాంక అరుల్ మోహన్ కెరీర్ సాగింది.
హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మూడేళ్ళలో ఐదు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. ఇంతవరకు తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. దీనికి కారణం ప్రియాంక కు తమిళ్ లోనూ అవకాశాలు సన్నగిళ్లడమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అమ్మడు కన్నడం, తెలుగు, తమిళం మూడు భాషల్లోనూ హీరోయిన్ గా అవకాశాల వేట మొదలుపెట్టిందని టాక్. అంతేకాదు వరుసగా ఫోటో షూట్స్ చేస్తూ ఇన్‌స్ట్రాగామ్ ద్వారా దర్శక నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది.
అయితే గ్లామర్ షో కు దూరంగా ఉండటంతోనే ప్రియాంక కు ఆఫర్స్ రావడం లేదనే కామెంట్స్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. మరి ఈ బ్యూటీ పద్ధతిగా చేసే ఈ ఫోటో షూట్స్ క్రేజీ ఆఫర్స్ అందిసస్తాయో లేదో చూడాలి.