ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప ది రైజ్'తో పాన్ ఇండియా స్టార్ ల జాబితాలో చేరిపోయిన విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సెన్సేషన్ దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ సంచలనం సృష్టించింది. ఫస్ట్ పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి విజయానప్ని సాధించిన నేపథ్యంలో పార్ట్ 2 పై దేశ వ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా 'పుష్ప 2'ని మరిన్ని ప్రత్యేకతలతో తెరపైకి తీసుకురాబోతున్నారు.
పార్ట్ 1 కి మించిన భారీ బడ్జెట్ తో సరికొత్త కథతో మరిన్ని ప్రత్యేకతలతో 'పుష్ప 2'ని భారీ స్థాయిలో తెరపైకి తీసుకురావడానికి దర్శకుడు సుకుమార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. రీసెంట్ గా ఈ మూవీని రష్యాలో భారీ స్థాయిలో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
డిసెంబర్ 8న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అయిన 'పుష్ప' అక్కడ భారీ క్రేజ్ ని సొంతం చేసుకుంటూ మాస్కో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అక్కడ ప్రమోషన్స్ కోసం రష్యా రాజధాని మాస్కో వెళ్లిన చిత్ర బృందం అక్కడ భారీ స్థాయిలో ప్రమోట్ చేసి రీ సెంట్ గా హైదరాబాద్ వచ్చేశారు.
ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అయిపోతున్నారు. డిసెంబర్ కు ఈ మూవీ విడుదలై ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం డిసెంబర్ 12న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని హైదరాబాద్ లో భారీ స్థాయిలో ప్రారంభించబోతున్నారు. ఇందు కోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని తెలిసంది. ఇదిలా వుంటే ఫిల్మ్ ఫేర్ లో ఏడు అవార్డుల్ని దక్కించుకుని ఆశ్చర్యపరిచిన 'పుష్ప' ప్రతిష్టాత్మక సైమా అవార్డ్స్ లోనూ మరో ఏడు అవార్డుల్ని సొంతం చేసుకుని ఆశ్చర్యపరిచింది.
తాజాగా పుష్పరాజ్ ఖాతాలో మరో గౌరవం చేరినట్టుగా తెలుస్తోంది. ప్రఖ్యాత జీక్యూ మెన్ మ్యాగజైన్ 2022 కి గానూ జీక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుని అల్లు అర్జున్ కి అందజేసినట్టుగా తెలిసింది. శని వారం ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చిన జీక్యూ టీమ్ పుష్పరాజ్ కు ప్రత్యేకంగా పార్టీని ఇచ్చారట. ఇదే సందర్భంగా అల్లు అర్జున్ కి జీక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుని అందజేశారని తెలిసింది. దీంతో బన్నీ క్రేజ్ పాన్ ఇండియా వైడ్ గా మరింతగా పెరగడం ఖాయం అని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.