యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ''ప్రాజెక్ట్ K'' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో నటించే సువర్ణావకాశాన్ని కల్పిస్తూ.. మేకర్స్ క్యాస్టింగ్ కాల్ ఇచ్చారు.
ఇప్పటికే 'ప్రాజెక్ట్ K' చిత్రానికి సంబంధించిన పలు ప్రధాన నగరాల్లో ఆడియన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. బెంగుళూరు - చెన్నై - పుదుచ్చేరి - కొచ్చి వంటి నగరాల్లో సెప్టెంబర్ నెలలో ఆడియన్స్ జరిపి, కొందరు ఔత్సాహికులను ఎంపిక చేసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు హైదరాబాద్ వారి కోసం క్యాస్టింగ్ కాల్ ప్రకటన వచ్చింది. 'హైదరాబాదీలు, ఇప్పుడు మీ వంతు.. త్వరపడండి!! భవిష్యత్తును ఫేస్ చేయడానికి సిద్ధపదండి' ని మేకర్స్ పేర్కొన్నారు.
ఆసక్తి ఉన్న 50-70 ఏళ్ల పురుషులు మహిళలు తమ ప్రొఫైల్ ను ఆడిషన్ వీడియోని నిర్మాణ సంస్థ అధికారిక మెయిల్ కు పంపవలసిందిగా ప్రకటనలో తెలిపారు. మరి ప్రభాస్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ లో నటించే గోల్డెన్ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి. ఇంతకముందు 9- 14 సంవత్సరాల వయసున్న అమ్మాయిలు.. 20-35 ఏళ్లున్న ఎనర్జిటిక్ డ్యాన్సర్స్ - జిమ్నాస్టిక్ లో ప్రావీణ్యం ఉన్న జెంట్స్ - డ్యాన్సర్స్ - మార్షల్ ఆర్టిస్ట్స్ - మోడల్స్ కోసం క్యాస్టింగ్ కాల్ ఇచ్చారు.
కాగా, ''ప్రాజెక్ట్ K'' సైన్స్ ఫిక్షన్ - సోషియో ఫాంటసీ జోనర్ లో తెరకెక్కుతున్న సూపర్ హీరో మూవీ అని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా తదుపరి షెడ్యూల్ డిసెంబర్ లో ప్రారంభం కానుందని సమాచారం.
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. డానీ శాంచెజ్-లోపెజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో భారతీయ భాషలతో పాటుగా పలు విదేశీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.