సీజీ లేనిదే సినిమా లేదు. సినిమాకి సౌండ్ - ఎఫెక్ట్స్ ఎంత కీలకమో సీజీ వర్క్ అంతకంటే ఎక్కువ కీలకం అయిపోయింది. కంప్యూటర్ గ్రాఫిక్స్ తో అసాధారణ ఫీట్స్ వేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ వీటిపై ఆధారపడుతున్నారు. అయితే ఇలా వెంపర్లాడే క్రమంలో దర్శకనిర్మాతలు కొన్ని ఉచ్ఛనీచాల్ని మరిచిపోతున్నారన్న కంప్లయింట్ వస్తోంది.
కాస్ట్ కంట్రోల్ పేరుతో పనికి తగ్గ రుసుము చెల్లించేందుకు నిర్మాతలు ముందుకు రాకపోవడంతో కొన్ని కంపెనీలు సగం డబ్బులకే పని పూర్తి చేస్తామని వర్క్ తీసుకుంటున్నాయట. తీరా డెడ్ లైన్లు దగ్గరపడేసరికి పని పూర్తవ్వక, అటు సినిమాకి బ్యాడ్ నేమ్ తెస్తున్నాయి. తమకి ఉన్న గుర్తింపును కోల్పోతున్నాయి. ఇటీవల ఓ టాప్ సీజీ కంపెనీ వాస్తవంగా అయ్యే ఖర్చు కంటే సగం మొత్తానికే ఓ టాప్ ప్రొడ్యూసర్ తో ఒప్పందం కుదుర్చుకుంది. పని మొదలయ్యాక అనుకున్న క్వాలిటీని చూపించలేక చతికిలబడింది. అప్పటికే ఖర్చు తడిసి మోపెడవ్వడంతో ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయింది. ఇది టూ బ్యాడ్. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి భారీ బడ్జెట్ లతో తెరకెక్కించే సినిమాలకు ఇలాంటివి తగవని ఎనలిస్టులు సూచిస్తున్నారు. ఇలాంటి తప్పులు ఏ ఒక్క కంపెనీయో కాదు, చాలా ప్రొడక్షన్ హౌసెస్ చేస్తున్నాయని చెబుతున్నారు.
వాస్తవానికి ఏదైనా రికగ్నైజ్డ్ కంపెనీతో ఒప్పందం చేసుకుంటూ చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ కొందరు ఇండివిడ్యువల్స్ తో ఒప్పందాలు చేసుకుని కాస్ట్ కటింగ్ కోరుకుంటే ఇలానే అవుతుందని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడర్థమైందా? గ‌్రాఫిక్స్ పనితనం గురించి?