గ్రేట్ గ్రాండ్ మస్తీ.. చూశారంటే సుస్తీ!!

Update: 2016-07-15 12:17 GMT
అదేంటో తెలియదు కాని.. హిందీలో ఒక్కోసారి భలే సినిమాలు వస్తుంటాయి. వాటిని చూడటానికి ఎంత కష్టపడాలంటే అంత కష్టడాలి. మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోతుంది. ఈరోజు ఆల్రెడీ తెలుగులో ''సెల్ఫీ రాజా'' అలాంటి పంచే ఇవ్వగా.. బాలీవుడ్డోళ్ళకి కూడా ఒక పంచ్‌ తగిలింది. అదే.. గ్రేట్‌ గ్రాండ్‌ సుస్తీ.. సారీ.. గ్రేట్‌ గ్రాండుతో కుస్తీ.. ఓ మళ్ళీ సారీ.. ''గ్రేట్‌ గ్రాండ్‌ మస్తీ'' అనే సినిమా గురించే.

ఈ సినిమా స్టోరీ లైన్ సింగిల్ లైన్లో చెప్పుకోవాలంటే.. ఒక వర్జిన్ దెయ్యం ముగ్గురి హీరోల ముందు ప్రత్యక్షమయ్యి.. తన కోరికలు తీర్చమంటుంది. అసలు దెయ్యాలంటేనే టెర్రర్.. మళ్ళీ వాటిలో వర్జిన్ దెయ్యం? ఇక స్ర్కీన్ మీద ఈ కన్యాకామెడీ చూడలేక జనాలు చచ్చిపోతున్నారంటే ఒట్టు. ముఖ్యంగా రితేష్ దేశ్ముఖ్, వివేక్ ఒబెరాయ్ అండ్ కో వేసే కుళ్లు జోకులను తట్టుకొని.. అలాగే వర్జిన్ దెయ్యంగా ఊర్శశి రౌతేలా చెప్పే రోత డైలాగులు నుండి.. ఆమె అందాల ప్రదర్శన వరకు.. వామ్మో.. నాయనో.. ఈ టార్చర్ పిచ్చి పీక్స్ లో ఉందిలే. చూశారంటే ఖచ్చితంగా సుస్తీ చేస్తుంది. ఈ సుత్తిని భరించలేని బాలీవుడ్ క్రిటిక్స్ చాలామంది సినిమాకు జీరో స్టార్స్ కూడా ఇచ్చారులేండి.

నిజానికి ఎడల్ట్ కామెడీలు తీసుకుంటూ పోతే.. కొన్నాళ్ళకు కంటెంట్ తగ్గడం.. కొన్నాళ్ళకు జనాలకు ఆసక్తి తగ్గిపోవడం.. ఆ తరువాత ఇలాంటి సినిమాలు చూసేవారే కరువవ్వడం.. బాలీవుడ్డోళ్ళకి ఈరోజు ఈ ఫ్యూచర్ కనిపించుండాలే.
Tags:    

Similar News