మళ్లీ మిస్ ఇండియా పోటీల్లోకి రకుల్

Update: 2018-02-01 04:29 GMT
టాలీవుడ్ లో టాప్ గేర్ లో ఉన్న టాప్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఈ మధ్య వరుస ఫ్లాపులతో కాస్త దూకుడు తగ్గి ఉండొచ్చు కానీ.. అమ్మడికి ఒక్క సరైన హిట్ పడిందంటే మళ్లీ చెలరేగిపోవడం ఖాయం. అయితే 27 ఏళ్ల ఈ భామ ఈ సారి మిస్ ఇండియా పోటీల్లో తన ట్యాలెంట్ చూపించబోతోంది.

రకుల్ ఇప్పుడు కొత్తగా మిస్ ఇండియా రేస్ లోకి ఎలా వస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే 2011లో రకుల్ ఈ పోటీల్లో పాల్గొందని.. ఆ రేసులో ఐదో స్థానంలో నిలిచిందని అభిమానులకు బాగానే తెలుసు. మిస్ పీపుల్స్ ఛాయిస్.. మిస్ ఫ్రెష్ ఫేస్.. మిస్ ట్యాలెంటెడ్.. మిస్ బ్యూటిఫుల్ స్మైల్.. మిస్ బ్యూటిఫుల్ ఐస్.. ఇలా ఐదు టైటిల్స్ ను కూడా ఎగరేసుకుపోయింది. ఈ ఏడాది కూడా రకుల్ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లోకి వస్తున్న మాట నిజమే కానీ.. కంటెస్టెంట్ గా కాదు.. ఈసారి సౌత్ జోన్ కి మెంటార్ గా వ్యవహరించనుంది రకుల్ ప్రీత్ సింగ్.

ఈ అందాల పోటీల్లో పోటీపడే భామలకు తన వంతుగా ఎంత సాయం చేయగలదో.. అంతా చేస్తానని అంటున్న రకుల్.. తన లైఫ్ ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టిన చోటకు వచ్చినట్లు ఉందని అంటోంది. ఈ పోటీల్లో పాల్గొని ఏడేళ్లు గడిచిందంటే నమ్మలేకపోతున్నా అంటోంది రకుల్. సౌత్ జోన్ కు రకుల్ ప్రీత్ మెంటార్ గా వ్యవహరించనుండగా.. ఈస్ట్ జోన్ కు నేహా ధూపియా.. ఈస్ట్ జోన్ కు పూజా చోప్రా.. వెస్ట్ జోన్ కు పూజా హెగ్డే మెంటార్స్ గా ఉండనున్నారు.
Tags:    

Similar News