తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల రేట్లు పెంచాలని నిర్మాతల నుంచి ఎప్పట్నుంచో డిమాండ్ ఉంది. ఐతే ఇప్పటికే ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోయిందని.. టికెట్ల రేట్లు పెంచితే ఆక్యుపెన్సీ మరింత తగ్గిపోతుందన్న ఆందోళనా లేకపోలేదు. ఐతే ఇటీవలే టికెట్ల రేట్లు పెంచే ప్రతిపాదనలు ప్రభుత్వాల వద్దకు వెళ్లాయి. కానీ వాటికి ఇంకా ఆమోదం రాలేదు. ఈలోపు జీఎస్టీ పుణ్యమా అని తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు పెరగడం పక్కా అని తేలిపోయింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్లపై 15 శాతం వినోదనపు పన్ను వేస్తోంది. ఐతే జీఎస్టీ అమల్లోకి వచ్చాక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ వినోదపు పన్ను సమానంగా 28 శాతం ఉండబోతోంది. కాబట్టి ఆ పన్నుకు తగ్గట్లుగా టికెట్ల రేట్లు పెరగడం పక్కా అన్నమాట.
ఐతే జీఎస్టీ వల్ల సినిమా టికెట్ల రేట్లు తగ్గే రాష్ట్రాలు కూడా లేకపోలేదు. ఉదాహరణకు మహారాష్ట్ర సంగతి చూస్తే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం విధించే వినోదపు పన్ను 45 శాతం ఉండటం గమనార్హం. జీఎస్టీ ప్రకారం 28 శాతం పన్ను అన్నది వాళ్లకు కలిసొచ్చేదే. అక్కడ టికెట్ల రేట్లు తగ్గే అవకాశముంది. ఐతే జీఎస్టీ దెబ్బకు పెద్ద పంచ్ పడేది తమిళ ప్రేక్షకులకు.. నిర్మాతలకే. అక్కడ తమిళంలో సినిమాల పేర్లు పెట్టి.. క్లీన్ యు సర్టిఫికెట్ తెచ్చుకుంటే ఆ సినిమాకు వినోదపు పన్ను పూర్తిగా మినహాయిస్తారు. ఐతే జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇలాంటివి కుదరవు. ప్రతి టికెట్ మీదా 28 శాతం పన్ను కట్టాల్సిందే. అంటే ఇటు నిర్మాతలకు.. అటు ప్రేక్షకులకు బ్యాండ్ తప్పదన్నమాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/