గిన్నీస్ రికార్డ్‌ దక్కించుకున్న సినిమాకి వింత పరిస్థితి

Update: 2022-08-30 14:39 GMT
మనసానమః అనే షార్ట్‌ ఫిల్మ్ గురించి గతంలో పలు సార్లు మీడియాలో చర్చ జరిగింది. ఒక చిన్న షార్ట్‌ ఫిల్మ్‌ కు పదుల కొద్ది అవార్డులు రావడంతో పాటు ఎన్నో అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్‌ ఫెస్టివల్స్ లో స్క్రీనింగ్‌ చేసే అవకాశం దక్కింది.

అంతే కాకుండా ఈ సినిమా అత్యధిక అవార్డులను దక్కించుకోవడంతో గిన్నీస్ బుక్ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డును కూడా దక్కించుకున్న విషయం తెల్సిందే.

ఎన్నో పురస్కారాలను గౌరవాలను దక్కించుకున్న మనసానమః సినిమా దర్శకుడు దీపక్ రెడ్డి ఇప్పుడు వింత సమస్యను ఎదుర్కొంటున్నాడు. ఈ సినిమా ఎన్నో ఫిల్మ్‌ ఫెస్టివల్స్ లో ప్రదర్శించేందుకు అవకాశాలను దక్కించుకుంది. ఆస్కార్ క్వాలిఫైయింగ్‌ స్క్రీనింగ్‌ తో ఎన్నో పురష్కారాలు దక్కించుకున్న ఈ సినిమా అమెరికా కి దర్శకుడు వెళ్లలేక పోతున్నాడట.

దర్శకుడు దీపక్ రెడ్డి చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆస్కార్ క్వాలిఫైయింగ్‌ స్క్రీనింగ్ కు ఎంపికైనా కూడా వీసా పరిమితుల కారణంగా అమెరికా కి వెళ్లలేదు. మరోసారి అమెరికాలో ఫిల్మ్‌ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఛాన్స్ వచ్చినా కూడా వీసా స్లాట్ ని పొందడంలో నాకు సహాయం కావాలంటూ దీపక్ సోషల్‌ మీడియా లో ట్వీట్‌ చేశాడు.

అమెరికా వెళ్లేందుకు వీసా పొందేందుకు తనకు సహాయం కావాలని.. తన సినిమా స్క్రీనింగ్‌ కోసం అక్కడకు వెళ్లాలి అంటూ విజ్ఞప్తి చేసిన దీపక్ కు చాలా మంది మద్దతు తెలుపుతున్నారు. కొందరు ఆయన కు వెళ్లే విషయమై సలహాలు ఇస్తూ ఉంటే మరి కొందరు నేరుగా సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News