సినిమా చూసి గిన్నిస్ రికార్డు సొంతం

Update: 2022-04-19 08:30 GMT
సినిమాను చేసిన వారు గిన్నిస్ రికార్డును దక్కించుకోవచ్చు... సినిమాలో నటించిన వారు గిన్నిస్ రికార్డ్‌ ను దక్కించుకోవచ్చు. కాని మొదటి సారి ఒక వ్యక్తి సినిమాను చూడటం ద్వారా గిస్నిస్ రికార్డ్‌ ను దక్కించుకోవడం జరిగింది. ఆయన సాధించిన రికార్డు అలాంటి ఇలాంటి రికార్డ్‌ కాదు. ఒక అరుదైన అద్బుతమైన రికార్డ్ ఆయనకు దక్కింది. ఇలాంటి ఒక రికార్డు కూడా ఉంటుందా అనుకునే వారు చాలా మంది ఉన్నారు.

అసలు విషయానికి వస్తే ఒక సినిమాను ఒక సారి చూస్తాం.. లేదంటే రెండు మూడు సార్లు చూస్తాం. కొందరు సినిమాకు వీరాభిమానులు అయితే.. ఆ సినిమాలో నటించిన హీరోకు వీరాభిమానులు అయితే పది సార్లు చూస్తారు. సరే కొందరు వంద సార్లు చూస్తారేమో కాని వందల సార్లు చూసే వారు మాత్రం ఉండరని ఇన్నాళ్లు అనుకున్నాం. కాని అనూహ్యంగా అమెరికాలో ఒక్క సినిమాను వందల సార్లు చూసి రికార్డు ను దక్కించుకున్నాడు.

అమెరికా ఫ్లోరిడా కు చెందిన రామిరో అలనిస్ అనే వ్యక్తి మూడు నెలల గ్యాప్‌ లో స్పైడర్ మ్యాన్‌.. నో వె హోమ్‌ సినిమా ను ఏకంగా 292 సార్లు చూశాడు.

ఈ విషయం ఇప్పుడు ప్రపంచం మొత్తం చర్చనీయాంశంగా మారింది. అతడు వెళ్లిన ప్రతి సారి కూడా సినిమా కు సంబంధించిన టికెట్ ను లేదా వీడియోను సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేశాడు.

ఈ సినిమాను చూడటం కోసం అతడు తన జీవితంలో 720 గంటలను కేటాయించాడట. అంతే కాకుండా 3400 డాలర్లను ఖర్చు చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. ఇండియన్ రూపాయల లెక్క అనుసారంగా 2.59 లక్షల రూపాయలను ఆయన ఖర్చు చేశాడు.

మొత్తానికి అతడు దక్కించుకున్న రికార్డ్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అతడు సినిమా నచ్చి చూశాడా.. ఇలా రికార్డు కోసం చూశాడా అంటూ మరికొందరు చర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News