సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒక మంచి మార్గం రెండవది అడ్డదారి. రెండవ దారిలో వెళ్లి కొందరు పాపులారిటీ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సెలబ్రెటీలపై బ్యాడ్ కామెంట్స్ చేస్తే ఫేమస్ అవ్వొచ్చు అని.. సెలబ్రెటీల గురించి తప్పుగా మాట్లాడటం లేదంటే వారిని విమర్శించడం వంటివి చేస్తే వారి దృష్టిలో పడవచ్చు అనేది కొందరి అభిప్రాయం. అందుకోసం పలువురు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.
తాజాగా శుభం మిశ్రా అనే ఒక వ్యక్తి సోషల్ మీడియా సెలబ్రెటీ మరియు లేడీ కమెడియన్ అయిన అగ్రిమా జాషువా పై కామెంట్స్ చేశాడు. ఆమె ఏడాది క్రితం పెట్టిన ఒక వీడియోను ఇప్పుడు షేర్ చేసి ఆ వీడియోపై తన అభిప్రాయంను చెబుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. చత్రపతి శివాజీ గురించి గతంలో అగ్రిమా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆ వీడియోను డిలీట్ చేయడంతో పాటు సారీ కూడా చెప్పింది. ఇప్పుడు మిశ్ర ఫేమస్ అవ్వడానికి ఆమెను టార్గెట్ చేశాడు.
అగ్రిమాను తీవ్ర పదజాలంతో దూషిస్తూ వీడియో పెట్టాడు. ఆమెను మానసికంగా లైంగిక వేదింపులకు పాల్పడ్డాడు. అతడి వీడియోను నేరుగా జాతీయ మహిళ కమీషన్ ముందుకు అగ్రిమా తీసుకు వెళ్లింది. వీడియోపై వెంటనే స్పందించిన జాతీయ మహిళ కమీషన్ గుజరాత్ డీజీపీకి లేఖ రాశారు. అతడిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అగ్రిమా ను వేదించిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని డీజీపీ పేర్కొన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఏ ఒక్కరిని కూడా వదిలి పెట్టబోమని ఆయన పేర్కొన్నాడు.