చిత్రీకరణ ముందు నుంచే హాట్ టాపిక్ గా మారి.. మోస్ట్ ఎవేటింగ్ మూవీగా నిలిచి.. పలుమార్లు రిలీజ్ డేట్లు మారాక విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ అస్కార్ రేసులోకి దిగిందన్న మాట తెలిసిందే. అయితే.. అస్కార్ రేసులో ఆర్ఆర్ఆర్ ఉందన్న విషయంపై చిత్ర దర్శకుడు జక్కన్న సైతం పెద్దగా రియాక్టు అయ్యింది లేదు. ఇలాంటివేళ.. ఆర్ఆర్ఆర్ కాదు.. భారత్ నుంచి మరో మూవీని బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం విభాగంలో ఎంపికైందన్న వార్త బయటకు వచ్చింది. గుజరాతీ మూవీ అయిన ఛెల్లో షో ఎంపికైనట్లుగా ప్రకటించారు.
అస్కార్ రేసులో నిలిచిన గుజరాతీ ఫిలిం గురించి ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. పాన్ నలిన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో భవిన్ రాబరి.. భవేష్ శ్రీమాలి.. రిచా మీనా తదితరులు నటించిన ఈ మూవీ కథేంటి?
అస్కార్ రేసులో నిలిచిన ఈ గుజరాతీ మూవీ ప్రత్యేకత ఏమిటన్నది చూస్తే.. చిత్ర దర్శకుడు నలిన్ జీవితంలో జరిగిన ఘటన ఆధారంగా ఈ మూవీని తీయటంగా చెప్పాలి. ఇప్పటికే పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమై.. విమర్శకుల మెప్పు పొందిన ఈ చిత్ర కథేమంటే?
గుజరాత్ లోని సౌరాష్ట్రలోని చలాలా గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల కుర్రాడు సమయ్ (భవిన్ రాబరి). సినిమా ప్రొజెక్టర్ టెక్నీషియన్ అయిన ఫజల్ (భవేష్ శ్రీమాలి) మెప్పు పొంది ఎట్టకేలకు తన కలల ప్రపంచమైన సినిమా హాల్ ప్రొజెక్షన్ బూత్ లోకి వెళ్లగలుగుతాడు. అలా ఎండాకాలంలో చాలా సినిమాలు చూస్తాడు. ఆ తర్వాత సొంతంగా తానే ఒక ప్రొజెక్షన్ ను తయారు చేయాలని భావిస్తాడు.
సినిమా ఏ రీతిలో ప్రభావాన్ని చూపుతుందన్న అంశంపై ఈ సినిమా ఉందని చెప్పాలి. తమ సినిమాపై తమకు నమ్మకం ఉందని.. ఈ చిత్రాన్ని అస్కార్ కు ఎంపిక చేసినందుకు చిత్ర టీం సంతోషాన్ని వ్యక్తం చేసింది.
తానిప్పుడు మళ్లీ ఊపిరి పీల్చుకోగలుగుతున్నానని.. సినిమా అనేది వినోదాన్ని.. స్ఫూర్తిని.. నాలెడ్జ్ ను అందిస్తుందని నమ్ముతున్నట్లుగా చిత్ర దర్శకుడు ట్వీట్ చేయటం గమనార్హం. మొత్తంగా ఆర్ఆర్ఆర్ కాదని బరిలోకి నిలిచిన ఈ పిల్లాడి మూవీ ఏ మేరకు ముందుకెళుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.