'లక్ బై ఛాన్స్'.. 'జిందగీ న మిలేగి దొబారా' లాంటి సినిమాలతో మెప్పించిన జోయా అఖ్తర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'గల్లీ బాయ్'. రణవీర్ సింగ్.. అలియా భట్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లు గా నటించారు. జోయా.. ఆమె సోదరుడు ఫర్హాన్ అఖ్తర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ ఈ రోజే రిలీజ్ అయింది. రెండు నిముషాల 42 సెకన్ల ట్రైలర్ లో పెద్ద ర్యాపర్ కావాలనే కలలు గానే పేదింటి ముంబై అబ్బాయిగా రణవీర్ సింగ్ కనిపించాడు. ఈ ప్రాసెస్ లో తనకు ఎదురయ్యే తిరస్కారాలు.. ఎలా ఫైనల్ గా ర్యాపర్ గా విజయం సాధించాడన్నది శాంపిల్ గా చూపించారు.
ఈ సినిమాలో అలియా టెంపర్ ఎక్కువగా ఉండే మెడికల్ స్టూడెంట్ పాత్రలో కనిపించింది. ఒక సీన్ లో "సకీనా నీకు వంట వచ్చా" అని ఓ పెద్దావిడ అడిగితే "రాదు. కానీ అంతా సవ్యంగా జరిగితే మీకు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చెయ్యగలను" అంటూ షాక్ ఇస్తుంది. మరో సీన్ లో రణవీర్ అలియాతో "నువ్వో పెద్ద గూండావి" అంటాడు. దీంతో అలియా "మళ్ళీ ఇంకెప్పుడూ చెయ్యను లే" అంటుంది. రణవీర్ "నామీద ఒట్టేయ్" అంటాడు. దీనికి కూల్ గా సమాధానమిస్తూ "చచ్చిపోతావు నువ్వు" అంటుంది. మరో సీన్లో లిప్ లాకు కూడా ఉంది.
'మేరె గల్లీ మే' సాంగ్ తో గుర్తింపు సాధించిన ముంబై ర్యాప్ సింగర్స్ డివైన్(వివియన్ ఫెర్నాండెజ్).. నవెద్ షేక్(నేజీ) ల జీవితంలో ని కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ముంబైలోని పేదలు ఉండే ఏరియాల వాతావరణం కళ్ళకు కట్టినట్టు చూపించారు.
రణవీర్ పాడే ర్యాప్ సాంగ్ లో "తూ నంగా హీతో ఆయా హై.. క్యా ఘంటా లేకే జాయేగా..అప్నా టైం ఆయేగా" అనే లిరిక్స్ ఉన్నాయి. ఈ జనరేషన్ యూత్ కు ఇన్స్టంట్ గా కనెక్ట్ అయ్యే ఎలిమెంట్సే ఇవి. విజయ్ రాజ్.. కల్కి కోచ్లిన్ లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ట్రైలర్ చూస్తుంటే సినిమా సంచలనం సృష్టించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనిపిస్తోంది. ఫిబ్రవరి 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి అంతలోపు ట్రైలర్ పై ఒక లుక్కేయండి.
Full View