తెరపైకి గుమ్మడి నర్సయ్య బయోపిక్

Update: 2021-03-12 04:38 GMT
బయోపిక్ లా కాలం ఇదీ.. కొన్ని ఏళ్లుగా దేశమంతా దిగ్గజ ప్రముఖుల బయోపిక్ లు తీస్తున్నారు. తాజాగా టాలీవుడ్ లోనూ ఈ హవా నడిచింది. తెలుగులో కూడా ఈ సంస్కృతి బాగా పెరిగింది. ఇటీవల కాలంలో వచ్చిన మహానటి, ఎన్టీఆర్ బయోపిక్, యాత్ర వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి.

ఈ తరహాలోనే ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఈ మధ్య అందరి మాటల్లో చర్చకు దారితీస్తోంది. ప్రముఖ రాజకీయ నాయకుడు, అవినీతి మచ్చ లేని, 5 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయినప్పటికీ ఎలాంటి దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడకుండా కేవలం ప్రజాసేవకే తన జీవితం అంకితం చేసిన ప్రజా నాయకుడడు గుమ్మడి నర్సయ్య రాజకీయ ప్రస్థానం గురించి ఓ బయోపిక్ తీస్తున్నట్టు ఫిల్మ్ నగర్ లో ఓ టాక్ నడుస్తోంది.

గత ఆరు నెలలుగా ఈ కథకు సంబంధించిన అధ్యయనం జరుగుతోందని ఈ సినిమాను పరమేశ్వర్ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తారని సమాచారం. ఈ మేరకు రంగం సిద్ధం అయినట్టు ప్రచారం సాగుతోంది.

ఈ ఆదర్శ నాయకుడి బయోపిక్ కార్యరూపం దాల్చితే.. ఈ తరంతోపాటు రాబోయే తరాల రాజకీయ నాయకులకు కూడా తెలిసే అవకాశం ఉంది.
Tags:    

Similar News