బాహుబలిలో భల్లాలదేవాగా నట విశ్వరూపం చూపించిన రానా ఇకపై హిరణ్యకశిప అవతారం ఎత్తబోతున్నాడు. దీనికి గుణశేఖర్ దర్శకత్వం వహించడంతో పాటు స్వీయ నిర్మాణం చేయబోతున్నారు. దీని గురించి ప్రచారం చాలా నెలలు నుంచే ఉన్నప్పటికీ స్క్రిప్ట్ వర్క్ పూర్తికాని కారణంగా ఇప్పటిదాకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఇప్పుడది ఓ కొలిక్కి రావడంతో గుణశేఖర్ సోషల్ మీడియా వేదికగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతున్నట్టు ప్రకటించాడు.
రుద్రమదేవి తీస్తున్న టైంలోనే రానాలో స్పార్క్ గుర్తించిన గుణ అప్పటి నుంచే తన మనసులో హిరణ్యకశిపగా రానాను ఊహించుకునే పనిని పూర్తి చేశాడు. మూడేళ్ళ పాటు యజ్ఞంలా స్క్రిప్ట్ వర్క్ జరిగిందని ఇక సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అని అభిమానులకు గుడ్ న్యూస్ అందించాడు. మరి ఇంత పెద్ద కాన్వాస్ అంటే బడ్జెట్ ఎంత అనే సందేహాలు రావొచ్చు. అధికారికంగా చెప్పలేదు కానీ వంద కోట్ల దాకా సబ్జెక్టు డిమాండ్ చచేస్తోందని ఇన్ సైడ్ టాక్. సురేష్ సంస్థతో పాటు మరో రెండు మూడు బడా ప్రొడక్షన్ కంపెనీలను పార్ట్నర్స్ గా పెట్టేసి ప్లానింగ్ జరుగుతున్నట్టు సమాచారం.
పైన చెప్పిన ఫిగర్ కంటే ఖర్చు ఇంకా ఎక్కువైనా ఆశ్చర్యం లేదని వినికిడి. ఎప్పుడు మొదలయ్యేది ఇంకా ఖరారు కాలేదు. రానా ప్రస్తుతం హాథీ మేరె సాతి షూటింగ్ లో ఉన్నాడు. త్వరలో వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందే పొలిటికల్ థ్రిల్లర్ కోసం జాయిన్ అవుతాడు. హిరణ్యకశిప ఈ ఏడాది చివరి లోపు రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరి రానా మార్కెట్ కు అంత బడ్జెట్ అంటే ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో వేచి చూడాలి