స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ చారిత్రక నేపథ్యంలో 'రుద్రమదేవి' వంటి భారీ మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత కొంత విరామం తీసుకున్న ఆయన మహాభారతంలోని ఆదిపర్వంలో అత్యంత కీలకంగా నిలిచిన శాకుంతల, దుష్యంతుడి ప్రేమకావ్యాన్ని ప్రధానంగా తీసుకుని 'శాకుంతలం' పేరుతో మైథలాజికల్ రొమాంటిక్ డ్రామాని తెరకెక్కిస్తున్న విషయం తెలిపిందే. అత్యంత భారీ స్థాయిలో ఎపిక్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
టైటిల్ పాత్రలో సమంత నటించగా, దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ని మాత్రమే ఇంత వరకు విడుదల చేసిన గుణశేఖర్ ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ని ఇంత వరకు విడుదల చేయలేదు. సైలెంట్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నారు. సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రకటన గుణశేఖర్ నుంచి రాకపోవడంతో శాకుంతలం గురించి ప్రేక్షకుల దాదాపుగా మర్చిపోయారు.
ఈ నేపథ్యంలో బుధవారం దర్శకుడు గుణశేఖర్ ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ప్రతీ ఒక్కరికీ ప్రేమతో కూడిన విభిన్నమైన కథగా 'శాకుంతలం'ను అందించడానికి సిద్ధంగా వున్నానని చెప్నుకొచ్చారు.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో భాగంగా తుది మెరుగులు దిద్దుకుంటోందని, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా త్వరలోనే అందరిని కలవాలని ఎదురుచూస్తున్నానన్నారు. దీంతో సమంత ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారట.
ఇదే సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. 'శాకుంతలం' తరువాత 'హిరణ్యకశ్యప' ప్రాజెక్ట్ ని భారీ మాసీవ్ స్కేల్ లో చేయబోతున్నానని ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు. 'శాకుంతలం' కు ముందు ఈ ప్రాజెక్ట్ నే గుణశేఖర్ చేయాలనుకున్న విషయం తెలిసిందే. రానా ప్రధాన పాత్రలో హాలీవుడ్ మేకర్స్ తో ఈ మూవీని అనుకున్నారు. అయితే కరోనా కారణంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్, అప్పుడున్న సమీకరణాల వల్ల దాన్ని పక్కన పెట్టి 'శాకుంతలం'ని సెట్స్ పైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
'శాకుంతలం' షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ కానున్న నేపథ్యంలో గుణశేఖర్ మళ్లీ 'హిరణ్యకశ్యప'ని తెరపైకి తీసుకురాబోతున్నారు. 'హిరణ్యకశ్యప'తో నరసింహా అవతారాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తానని ప్రామిస్ చేశాను. ఆ ప్రామిస్ ప్రకారమే ఈ ప్రాజెక్ట్ ని భారీ సంస్థలతో కలిసి తెరపైకి తీసుకురాబోతున్నానని గుణశేఖర్ బుధవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ఈ ప్రాజెక్ట్ ముందు అనుకున్నట్టుగా రానాతో వుంటుందా? లేక చేతులు మారుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.