హిర‌ణ్య‌క‌శిప నుంచి గుణ‌శేఖ‌ర్ ఔట్?

Update: 2022-12-11 06:32 GMT
రానా క‌థానాయ‌కుడిగా గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 'హిర‌ణ్య క‌శిప' చిత్రం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. భారీ బ‌డ్జెట్ తో చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్- గుణ టీమ్ వ‌ర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. టాలీవుడ్ నుంచి రాబోతోన్న మ‌రో ప్ర‌తిష్టాత్మ‌కంగా చిత్రంగా దీన్ని ప్ర‌మోట్ చేసారు. అందుకు త‌గ్గ‌ట్టు  హిర‌ణ్య క‌శిప క‌థ‌ని గుణశేఖ‌ర్ సిద్దం చేస్తున్న‌ట్లు గ‌త ఇంట‌ర్వ్యూల్లో  సురేష్ బాబు చెప్పుకొచ్చారు.

మ‌రి ఇప్పుడీ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం నుంచి గుణ శేఖ‌ర్ త‌ప్పుకున్నారా?  హిర‌ణ్య క‌శిప బాధ్య‌త‌లు మ‌రో అగ్ర ద‌ర్శ‌కుడు చూస్తున్నాడా? అంటే అవున‌నే అనిపిస్తుంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో సురేష్ బాబు హిర‌ణ్య క‌శిప గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. గుణ‌శేఖ‌ర్ పేరు ప్ర‌స్తావించి ఎక్క‌డా మాట్లాడ‌లేదు గానీ.... హిర‌ణ్య క‌శిప‌కు సంబంధించి మ‌రో పెద్ద ద‌ర్శ‌కుడితో క‌లిసి ప‌నిచేస్తున్నామ‌న్నారు.

ఆ విష‌యాల‌న్ని స్వ‌యంగా రానా ప్ర‌క‌టిస్తార‌ని తెలిపారు. దీన్ని బ‌ట్టి హిర‌ణ్య క‌శిప నుంచి గుణ శేఖ‌ర్ త‌ప్పుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పుడా ప్రాజెక్ట్ లోకి మ‌రో స్టార్ డైరెక్ట‌ర్ ని సీన్ లోకి తెచ్చారు. అత‌ని ఆధ్వ‌ర్యంలో క‌థ‌కి సంబంధించిన ప‌నులు జ‌రుగుతున్నాయి. మ‌రి గుణ శేఖ‌ర్ ఏ కార‌ణంగా త‌ప్పుకున్నారు? అస‌లు త‌ప్పుకోవాల్సిన కార‌ణాలు ఏమై ఉంటాయ‌న్న‌ది తెలియాలి.

గ‌తంలో సురేష్ బాబు గుణ ఆశ్వ‌ర్యంలో క‌థ‌కి సంబంధించి ప‌నులు జ‌రుగుతున్న‌ట్లు తెలిపారు. అందులో త‌మ ఇన్వాల్వ్  మెంట్ కూడా ఉటుంద‌ని వినిపించింది. ఈ నేప‌థ్యంలో  గుణ‌- సురేష్ బాబు మ‌ధ్య‌లో క్రియేటివ్ డిఫ‌రెన్సెస్  ఏవైనా త‌లెత్తి త‌ప్పుకున్నారా? అన్న‌ది ఓ సందేహం క‌నిపిస్తుంది. ఈ క‌థ‌ని మొద‌లు పెట్టింది గుణ‌శేఖ‌ర్.

కొంత కాలంగా ఆయ‌న చారిత్రాత్మ‌క క‌థ‌ల్నే టార్గెట్ చేసి పని చేస్తున్నారు. 'రుద్ర‌మ‌దేవి'  త‌ర్వాత 'హిర‌ణ్య క‌శిప‌'ని ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత 'శాకుంతంలం' తెర‌పైకి వ‌చ్చింది. ఈసినిమా షూటింగ్ పూర్త‌యింది. కానీ ఇంత వ‌ర‌కూ మ‌ళ్లీ ఎలాంటి అప్డేట్  లేదు. ఇంత‌లో హిర‌ణ్య‌క‌శిప‌కు సంబంధించి ఇలాంటి విష‌యం బ‌య‌ట‌కు రావ‌డం సంచ‌ల‌నంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News