3డి పనుల్లో జాప్యం వల్లే ఆలస్యం!

Update: 2015-09-02 05:25 GMT

Full View
తెలుగువారి గొప్పతనాన్ని, కాకతీయుల వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలంటే అందుకు సరైన వేదిక సినిమానే. అలాంటి ప్రయత్నం చేస్తున్న గుణశేఖర్‌ అభినందనీయుడు. తెలుగువారి కీర్తి పతాకను ప్రపంచదేశాలలో ఎగుర వేయాలన్న ఆయన ఆలోచన బావుంది. కాకతీయ వీరనారి రుద్రమదేవి చరిత్రను ఒక 3డి సినిమాగా తెరకెక్కించి ఓ తెలుగు దర్శకుడిగా గర్వంగా చెప్పుకోవాలన్న తపనలో బడ్జెట్‌ పరంగా రాజీ లేకుండా ఖర్చు చేశారాయన.

రేయింబవళ్లు సినిమా కోసమే కష్టించి శభాష్‌ అనిపించుకున్నారు గుణా. కాని సినిమా అయితే తీశాడు కానీ రిలీజ్‌ విషయంలో ఎన్నో ఆటంకాల్ని ఎదుర్కొంటున్నాడు. ప్రభుత్వాలు పన్ను మినహాయింపులు ఇచ్చాయో లేదో కానీ, అతడికి ఇంకా అంతూ దరీ లేని ఖర్చులే. ఏదేమైనా అన్నిటినీ మొక్కవోని ధీక్షతో ఎదురించాడు. అతడు రుద్రమను మించి పోరాడి వీరుడయ్యాడు. ఎట్టకేలకు ఈనెల 4న రిలీజైపోతోంది అనుకుంటున్న టైమ్‌ లో మరోసారి వాయిదా.. తెలుగు ప్రేక్షకులకు సారీ! అంటూ ట్విస్టిచ్చాడు.

''క్షమాపణలు చెబుతున్నా.. 3డి పనుల వలనే లేటు'' అంటూ ఎక్సప్లనేషన్‌ ఇచ్చాడు దర్శకుడు. 3డిలో రుద్రమను చూసుకోవాలన్న ఆత్రంలో ఉన్న తెలుగువారికి ఇది నిజంగా షాక్‌. అయితేనేం అక్టోబర్‌ 9 రిలీజ్‌. అంతవరకూ ఆగండి ప్లీజ్‌. అంటూ గుణశేఖర్‌ రెక్వస్ట్‌ చేశాడు. ఇంతకాలం ఆగాం.. ఈ నెలరోజులు ఆగలేం?
Tags:    

Similar News