వరుసగా ఐదారు సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచాక ఎట్టకేలకు ‘టెంపర్’ సినిమాతో మోస్ట్ వాంటెడ్ హిట్టు అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు సుకుమార్ తో ‘నాన్నకు ప్రేమతో’ చేస్తున్నాడు. ఆ తర్వాత కొరటాల శివతో సినిమాను లైన్ లో పెట్టాడు. ఇప్పుడిప్పుడే అతడి కెరీర్ కుదుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఓ చారిత్రక సినిమా చేసే రిస్క్ కు ఓకే అంటాడా అన్నది డౌటు. కానీ గుణశేఖర్ మాత్రం ఎన్టీఆర్ అయితేనే తన తర్వాతి సినిమాకు న్యాయం చేయగలడని ఫిక్సయిపోయాడట.
‘రుద్రమదేవి’ సినిమాతో తాను చేసిన మహా రిస్క్ ఫలితాన్నివ్వడంతో ఇక ఎలాంటి సాహసానికైనా సిద్ధం అన్న ఫీలింగ్ లో ఉన్న గుణశేఖర్.. దీని తర్వాత అభిమన్యుడి కథతో సినిమా చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘వీరాభిమన్యు’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడు. ముందు ఇదేమైనా మామూలు సినిమాయేమో అనుకున్నారు. కానీ నిజంగానే అభిమన్యుడి కథతోనే సినిమా తీయాలని అనుకుంటున్నాడట గుణ.
ముందు ఈ పాత్రకు అల్లు అర్జున్ పేరు వినిపించింది కానీ.. పౌరాణిక పాత్రకు ఎన్టీఆర్ మాత్రమే న్యాయం చేయగలడని భావిస్తున్నాడట గుణ. అందుకే నందమూరి హీరోతో సంప్రదింపులు జరుపుతున్నాడట. ఐతే కెరీర్ ను ఇప్పుడిప్పుడే చక్కదిద్దుకుంటున్న ఎన్టీఆర్.. ఈ సమయంలో పౌరాణిక పాత్ర చేయడమంటే చాలా పెద్ద రిస్క్ అన్నట్లే. మరి అంత పెద్ద రిస్క్ చేయడానికి అతను ఓకే అంటాడా?