ఈ తన్నులు తినే బ్రూస్ లీ ఎవరబ్బా..

Update: 2016-09-09 13:52 GMT
మామూలుగా టీజర్లతో రచ్చ చేయడం అంటే.. అందుకు తమిళనాడులో హీరోగా ప్రూవ్ చేసుకుంటున్న ఏ.ఆర్.రెహ్మాన్ మేనల్లుడు జి.వి.ప్రకాష్‌ గురించే చెప్పాలి. ఒక ప్రక్కన సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తూనే మనోడు మరో ప్రక్కన హీరోగా కూడా చక్కగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అదిగో ఇప్పుడు 'బ్రూస్ లీ' అనే సినిమాతో వస్తున్నాడు.

ఆ మధ్యన 'ఎనక్కు ఇన్నోరు పేరు ఇరుక్కు' అనే సినిమా టీజర్ తో షేక్ చేసిన జి.వి.ప్రకాష్‌ ఇప్పుడు అదే తరహా మాస్ లుక్కులో ''బ్రూస్‌ లీ'' సినిమాతో వచ్చాడు. అయితే టీజర్లో మనోడు బ్రూస్ లీ పేరు చెప్పి బోలెడెంత బిల్డప్పులు ఇచ్చేసి.. చివరకు విలన్ల చేతిలో చెంప దెబ్బలు తింటూ ఉంటాడు. అదే కొస మెరుపు. ఇకపోతే తెలుగు బ్రూస్ లీ సినిమాలో రామ్ చరణ్‌ అక్కగా నటించిన హాట్ కృతి కర్భందా.. ఈ తమిళ బ్రూస్ లీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. టీజర్ లో ఆమెను గాల్లోకి లేపే షాటు చూస్తే.. పాపం బాగానే కష్టపడింది అనిపిస్తోంది.

ప్రశాంత్ పాండిరాజ్ డైరక్షన్లో రూపొందిన ఈ యాక్షన్ కామెడీతో.. ఈసారి జివి ప్రకాష్‌ తెలుగులోకూడా మాంచి హిట్టు కొట్టేయాలని చూస్తున్నాడు. అయితే ఈ తన్నులు తినే హీరో పాత్రలో తెలుగోళ్ళను ఇంప్రెస్ చేస్తాడా మరి? ఇంతకీ తెలుగులో టైటిల్ ఏమని పెడతారు రాజా?
Full View

Tags:    

Similar News