మాస్ మహారాజా రవితేజ హీరోగా స్పీడు పెంచేశాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలని పట్టాలెక్కించేస్తున్నాడు. `ఖిలాడీ` సినిమా ఆశించిన ఫలితాన్ని అందించకపోవడంతో తన దృష్టిని తదుపరి చిత్రాలవైపు మళ్లించిన మాస్ రాజా నాలుగు చిత్రాలతో ప్రస్తుతం బిజీగా వున్నారు. అందులో `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అయిపోయింది. మరో రెండు చిత్రాలు ధమాకా, రావణాసుర చిత్రీకరణ దశలో వున్నాయి. తాజాగా మరో చిత్రాన్ని ఉగాది రోజున లాంఛనంగా ప్రారంభించాడు.
అదే `టైగర్ నాగేశ్వరరావు`. స్టూవర్టు పురం గజదొంగగా పేరు పడిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆథారంగా అదే పేరుతో బయోపిక్ ని తెరకెక్కిస్తున్నారు. రవితేజ టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ మూవీని ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి క్లాప్ తో లాంఛనంగా ప్రారంభించారు.
క్రితి సనన్ సోదరి నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్ లుగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. దాదాపు పదేళ్ల విరామం తరువాత జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త, జెండాపై కపిరాజు వంటి చిత్రాలకు సంగీతం అందించాడు. ఈ చిత్రాల్లో అత్యధికం మ్యూజికల్ హిట్లే. తెలుగులో జీవీ ప్రకాష్ సంగీతం అందించిన చివరి చిత్రం నాని నటించిన `జెండా పై కపిరాజు`.
ఈ మూవీ తరువాత జీవీ ప్రకాష్ తెలుగులో మరో సినిమాకు సంగీతం అందించలేదు. మళ్లీ ఇన్నేళ్లకు తెలుగు చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ మూవీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ మూవీతో పాటు ధనుష్ నటిస్తున్న ద్విభాషా చిత్రం `సర్`కి కూడా జీవీ నే సంగీతం అందిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.