వర్మ కాలు పెట్టగలడా?

Update: 2018-04-22 06:21 GMT
శ్రీరెడ్డిని ప్రేరేపించి పవన్ కళ్యాణ్ ని తిట్టించిన వివాదం రామ్ గోపాల్ వర్మకు కొత్త తలనెప్పులు తెచ్చి పెడుతోంది. వర్మ తత్వం దీనికి భయపడేది కాదు కాని వ్యతిరేకత మాత్రం రోజురోజుకి పెరిగిపోతోంది. వర్మను ఎంతగానో అభిమానించే అనంగు శిష్యుడు పూరి జగన్నాధ్ సైతం గురువు చేసిన పనిని మొదటి సారి మెచ్చలేకపోయాడు. తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధాకర్ నాయుడు ఏకంగా వర్మకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసాడు. గతంలో వంగవీటి సినిమా విషయంలో కూడా నాయుడు వర్మ మీద ఘాటు వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు ఏకంగా తాను ఎంతో అభిమానించే పవన్ మీద ఇలాంటి వివాదం తేవడంతో సుధాకర్ నాయుడు ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. దమ్ముంటే హైదరాబాద్ కు రమ్మని చూసుకుందామని నేరుగా బెదిరించేలా చెప్పడంతో ఇది ఇంకో మలుపు తిరిగేలా ఉంది.

నాగార్జున హీరోగా వర్మ దర్శకత్వంలో నిర్మించిన ఆఫీసర్ మే 25 విడుదల కావాల్సి ఉంది. ఇంకా ప్రమోషన్ మొదలు పెట్టలేదు. ఇప్పటిదాకా టీజర్ అండ్ ఫస్ట్ లుక్ మాత్రమే విడుదల చేసారు. వాటికి స్పందన బాగానే ఉంది. అసలైన కార్యక్రమం ఇంకా మొదలు పెట్టనే లేదు. తెలుగు సినిమా కాబట్టి హైదరాబాద్ కు రాకుండా మీడియాతో ఇంటరాక్ట్ కాకుండా వర్మ తన ఆఫీసర్ ని ప్రమోట్ చేసుకోవడం జరగని పని. పైగా ఆ ఉద్దేశంతో వచ్చినా మీడియా పవన్ ఉదంతం గురించి గుచ్చి గుచ్చి ప్రశ్నించడం ఖాయం. దానికి తోడు సుధాకర్ నాయుడు లాంటి వాళ్ళు దాడి చేస్తాం అనే తరహాలో బెదిరించడంతో వర్మ ఏం చేస్తాడు అనేది సస్పెన్స్ గా మారింది. గతంలో వంగవీటి సినిమా టైంలో బెజవాడలో కాలు పెడితే అంతు చూస్తాం అన్న బెదిరింపులకు లొంగకుండా దర్జాగా అక్కడికి వచ్చిన వర్మ ఇప్పుడు కూడా అదే తరహాలో వస్తాడా లేక వెనుకడుగు వేస్తాడా అనేది వేచి చూడాలి
Tags:    

Similar News