సరిలేరు నీకెవ్వరు చిత్రం నుంచి దసరా దీపావళి పోస్టర్లకు అద్భుత స్పందన వచ్చింది. వీటిలో మ్యాడమ్ 'భారతి' ఫస్ట్ లుక్ కి అద్భుత స్పందన వచ్చింది.. ఆ లుక్ ఎలా మెయింటెయిన్ చేయగలిగారు? అందుకోసం విజయశాంతి దినచర్య ఏమిటి? తెలిస్తే షాక్ తినాల్సిందే. 53 వయసులో సదరు సీనియర్ నటి హార్డ్ వర్క్ షాకింగ్ అనే చెప్పాలి.
ఓ ఇంటర్వ్యూలో విజయశాంతి మాట్లాడుతూ..'ఇన్నాళ్లు రాజకీయాలు ఉద్యమాలు అంటూ టెన్షన్స్ ఎదుర్కొన్నా. కానీ సినిమాలు అంటే అలా కాదు. ఆకృతిని మెయింటెయిన్ చేయాలి. బాడీని సరిగా మెయింటెయిన్ చేయాలి. అందుకోసం చాలానే శ్రమించాను. రెగ్యులర్ గా జిమ్ కి వెళుతున్నాను అని తెలిపారు. ఈ మేకవర్ మీ పట్టుదలతోనే సాధ్యమైందా? అని అడిగేస్తే.. అవును. రీఎంట్రీ కదా .. సీరియస్ గా తీసుకున్నా. రోజూ ఉదయం 2గం.లు జిమ్లో కసరత్తులు చేశాను. కేవలం 2 నెలల్లో 10 కేజీల బరువు తగ్గాను. అయితే అంత తగ్గాక డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ మరీ అంత తగ్గాల్సిన అవసరం లేదు... కొంచెం తగ్గితే చాలు అన్నారు. దాంతో మళ్లీ మేకవర్ ట్రై చేశాను అని వెల్లడించారు.
అయితే కంబ్యాక్ ని కూడా సూపర్ స్టార్ రేంజ్ తగ్గకుండా విజయశాంతి ఎంతో జాగ్రత్త పడుతున్నారట. స్టార్ హీరోలకు ధీటుగా తన రేంజ్ ఉండేందుకు తాపత్రాయ పడుతున్నారట. తదుపరి మెగాస్టార్ చిరంజీవి నుంచి విజయశాంతికి ఓ ఆఫర్ దక్కనుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అది కొరటాల సినిమానా లేక ఇంకేదైనానా? అన్నది ఇప్పటికి సస్పెన్స్. మరోవైపు వెబ్ సిరీస్ ల కోసం పలువురు తనని సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫిజికల్ ఫిట్ నెస్ పై లేడీ బాస్ పూర్తిగా దృష్టి సారించారట.