షూటింగా? వెయిటింగా?

Update: 2017-12-13 04:26 GMT
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న అజ్ఞాతవాసి మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సంక్రాంతి పండగకు ముందు ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఇందుకు సంబంధించిన పనుల్లో చిత్రం యూనిట్ మొత్తం బిజీగా ఉంది. ఈ సినిమా పూర్తయ్యాక త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ చేయాల్సి ఉంది.

ఓ రకంగా త్రివిక్రమ్ కు సొంత బ్యానర్ లాంటి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పైనే ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమా తెరకెక్కుతుందని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ స్వయంగా ముహూర్తం షాట్ కు హాజరయ్యాడు. ఓవైపు అజ్ఞాతవాసి షూటింగ్ పనులు ఓ కొలిక్కి వచ్చేసినా హారిక అండ్ హాసిని యూనిట్ లో ఎన్టీఆర్ సినిమా గురించి ఎక్కడా చడీచప్పుడు వినిపించడం లేదు. ఇంతలోనే ఈ సినిమా హారిక అండ్ హాసిని సినిమా తమ బ్యానర్ లో ఆరో సినిమా వెంకటేష్ తో తీయనున్నట్లు అనౌన్స్ చేసింది. దీంతో ప్రస్తుతానికి ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి పక్కన పెట్టేసినట్టేననే మాట వినిపిస్తోంది. దీనికితోడు దర్శక ధీరుడు రాజమౌళి ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో కలిసి మల్టీస్టారర్ కు ప్లాన్ చేస్తున్నాడు. ఇది మార్చిలో ప్రారంభమయ్యే అవకాశముంది. ఆ సమయానికి ఎన్టీఆర్ తో షూటింగ్ కంప్లీట్ చేయడం కష్టం కాబట్టి ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే పరిస్థితి లేదనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

‘‘వెంకటేష్ ప్రస్తుతం తేజ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా పూర్తవడానికి ఇంకా సమయం పడుతుంది. కాబట్టి సినిమా అనౌన్స్ చేసినా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి మరికొంత కాలం పడుతుంది. రాజమౌళి షూటింగ్ స్టార్ట్ చేసేపాటికి త్రివిక్రమ్ డైరెక్షన్ చేస్తున్న సినిమాలో ఎన్టీఆర్ చేయాల్సిన పార్ట్ చాలా వరకు పూర్తయిపోతుంది. కాబట్టి ఇబ్బందేమీ ఎదురు కాకపోవచ్చని’’ హారిక యూనిట్ బృంద సభ్యుడొకరు తెలిపారు. ఇంత టైట్ షెడ్యూల్ తో ప్లానింగ్ ఎంతవరకు సజావుగా సాగుతుందో వేచి చూడాలి మరి.



Tags:    

Similar News