సినిమా బిజినెస్ చాలా చమాత్కారంగా ఉంటుంది. తెలియకుండానే ఓ హీరో వల్ల వచ్చిన నష్టాల్ని మరో హీరో భర్తీ చేస్తుంటాడు - లేదా ఓ హీరో సినిమా ఫ్లాప్ అయితే ఆ తరువాత సినిమానే తీసే నిర్మాత ముందొచ్చిన నష్టాల్ని భరించాల్సి ఉంటుంది. అదేంటి ముందు వచ్చిన ఫ్లాపుకి వెనకొచ్చిన హిట్ అప్పులు తీర్చడం ఎంతవరకు న్యాయం అంటే మాత్రం - ఇండస్ట్రీలో సినిమా బిజినెస్ చేయలేం అని ఈ వర్తకంలో మునిగిపోయిన నిర్మాతలు ఓ నవ్వు నవ్వేస్తారు. ఇప్పుడు ఈ నవ్వులు బన్ని అప్ కమింగ్ సినిమా విషయంలో కూడా రిపీట్ కాబోతున్నాయి. బన్ని - త్రివిక్రమ్ కాంబినేషన్ లో హారికా హాసిని క్రియేషన్స్ పతాకం పై ఓ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. తాజాగా పూజతో మొదలైన ఈ సినిమా పనిలోనే ప్రస్తుతం బన్ని బిజీగా ఉన్నాడు.
అయితే ఇదే బ్యానర్ నుంచి తాజాగా నాని హీరోగా జెర్సీ అనే సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. నాని కెరీర్ లో బెస్ట్ సినిమా అంటూ విమర్శకులు ఈ సినిమాను తెగ పొగిడారు. ఈ బ్యానర్ లో సినిమాలు చేసిన జూనియర్ యన్టీఆర్ - అల్లు అర్జున్ అయితే మరో అడుగు ముందుకొచ్చి ట్విట్టర్ ద్వారా జెర్సీని తెగ ప్రమోట్ చేశారు. కానీ జెర్సీ రిలీజైన రోజే రాఘవ లారెన్స్ హారర్ కామెడీ సినిమా కాంచన 3 విడుదలైంది. జెర్సీ సినిమా బాగున్నప్పటికీ మాస్ ఈ సినిమాను అంగీకరించలేపోయారు - అటు వైపున కమర్షీయల్ ఎలిమెంట్స్ నిండుగా ఉన్న కాంచన 3కే లోకల్ ఆడియెన్స్ ఓటింగ్ పడింది. దీంతో జెర్సీని కొనుకున్న బయర్స్ కు దాదాపు 30 శాతం నష్టం వచ్చిందని ట్రేడ్ వర్గాలు తేల్చాయి. ఎలాగైనా బ్యానర్ పరువు కాపాడుకోవడానికి నిర్మాణ సంస్థ వాళ్లే బయర్స్ కు తిరిగి డబ్బులు ఇచ్చిన కాంచన కలెక్షన్స్ కంటే ఓ 10 శాతం ఎక్కువగా జెర్సీ ఎకౌంట్ లో పడేలా చేస్తున్నారని మార్కెట్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ కాంచన దెబ్బతో జెర్సీ కి నష్టాలు తప్పలేదన్నది వాస్తవం. ఇంతవరకు బాగానే ఉంది, ఇప్పుడు జెర్సీ కారణంగా వచ్చిన నష్టాల్ని అల్లుఅర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాతో భర్తీ చేసేందుకు హారికా హాసిని సంస్ధ వారు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. జెర్సీ ద్వారా నష్టపోయిన బయ్యర్స్ కు బన్ని - త్రివిక్రమ్ సినిమాను హామీ చూపిస్తున్నారని అంటున్నారు. అయితే ఇది బన్ని సపోర్ట్స్ కు పెద్దగా మింగుడు పడటంలేదు. ఎందుకంటే జెర్సీ ద్వారా నష్టాలు వచ్చిన బయ్యర్స్ కు బన్ని సినిమాను హామిగా చూపించడం కారణంగా ప్రి బిజినెస్ లో బాగా తగ్గిపోతుంది. 100 కోట్లు దాటి కలెక్షన్స్ సాధించే బన్ని వంటి స్టార్ హీరోకు ప్రీ బిజినెస్ క్రేజ్ చాలా అవసరం. అయితే ఈ క్రేజ్ ఇప్పుడు హారికా హాసినిలో సినిమాను చేస్తుండటంతో బన్నీ కొద్దిగా కోల్పోయాడనే అనుకోవాలి.