బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో అరెస్ట్..!

Update: 2020-12-10 13:39 GMT
బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్స్‌ వ్యవహారంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురిని విచారించిన అధికారులు డ్రగ్స్ కేసులో కొందరిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ సూరజ్ గోదాంబే ను ఎన్సీబీ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సూరజ్ గోదాంబే బాలీవుడ్ ప్రముఖులు వరుణ్ ధావన్ - అర్బాజ్ ఖాన్ - రాజ్‌ కుమార్ రావు వంటి హీరోలకు హెయిర్ స్టయిలిస్ట్‌ గా పనిచేశాడు. ఎన్‌సిబి జాయింట్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలోని ఆపరేషన్‌ లో సూరజ్ గోదాంబే సహా పలువురు డ్రగ్ స్మగ్లర్స్ ని కూడా పట్టకున్నారని తెలుస్తోంది. సూరజ్ గోదాంబే అరెస్టును ఎన్‌సిబి అధికారులు ధృవీకరించారు.

సూరజ్ గోదాంబే ఇంటి నుంచి ఎన్సీబీ అధికారులు16 బాటిల్స్‌ కొకైన్ ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి బాటిల్‌ లో సుమారు 11 గ్రాముల కొకైన్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ సమయంలో రూ .2.5 కోట్ల విలువైన ‘చరాస్’ని మరియు రూ .13.51 లక్షల విలువైన నగదును ఎన్సీబీ స్వాధీనం చేసుకుందని తెలుస్తోంది. డ్రగ్స్ దొరికిన పరిమాణాన్ని బట్టి చూస్తే అది వినియోగించడానికి తెచ్చినది మాత్రమే కాదని.. వాణిజ్య పరిమాణంలో ఉందని అధికారులు తెలిపారు. అతనిపై నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ ఫిజికోట్రోపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్ లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు.
Tags:    

Similar News