తెరపై హీరోయిన్ గా కనిపించే అవకాశం రావడమే గొప్ప విషయం .. తొలి ప్రయత్నంలోనే సక్సెస్ పడటం మరింత కష్టమైన విషయం. అయితే అవికా గోర్ విషయంలో ఇవి చాలా తేలికగా జరిగిపోయాయి. ముద్దుగా .. ముద్దబంతిలా తెరపై విరిసిన ఈ అమ్మాయిని చూసి కుర్రాళ్లంతా ముచ్చటపడ్డారు .. కాలంలో ముచ్చట్లు చెప్పుకున్నారు. కనుబొమల కలయిక .. బొద్దుగా అనిపించే నిండుదనం ఆమెలో ప్రత్యేకమైన ఆకర్షణ. అలాంటి ఈ అమ్మాయి నవ్వితే చాలు .. ఇంద్రధనుస్సు ఇళ్లకు దిగివచ్చినట్టుగా కుర్రాళ్లు ఫీలయ్యారు.
అలాంటి అవికా వరుసగా సినిమాలు సక్సెస్ అవుతుండగా .. అవకాశాలు డోర్ బెల్ కొడుతూ ఉండగా, చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది. ఆ సమయంలో అవకాశాలు ఆమెను వెదుకుతూ వెళ్లినా, పెద్దగా ఆసక్తి చూపలేదనే టాక్ వచ్చింది. ఈలోగా తెలుగు తెరకి కుర్రపిల్లలు చాలామందినే పరిచయం అయ్యారు. వాళ్లలో కొంతమంది చాలా దూరం వెళ్లిపోయారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో అవికా మళ్లీ తిరిగొచ్చింది. తాను వదిలేసిన ప్లేస్ ఎక్కడుందో చూసుకుని .. అక్కడి నుంచి మళ్లీ మొదలుపెడదామని అనుకుంది.
సిటీ బస్సు సీట్లో వేసిన కర్చీఫ్ అయినా బస్సు ఎక్కేవరకూ ఉంటుందేమోగానీ, సినిమా ఫీల్డ్ లో వదిలేసిన ప్లేస్ ఉంటుందా? అది గ్రహించిన ఈ అమ్మాయి, వచ్చిన అవకాశాలను వరసగా ఒప్పుకుంటూ వెళుతోంది. నిన్న ఈ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా జరిగిన సందడి చూస్తే, చేతిలో ఓ అరడజను సినిమాలు ఉన్నాయనే విషయం అర్థమవుతోంది. వాటిలో గట్టిగా నిలబడే సినిమాలు .. గుర్తుపెట్టుకునే పాత్రలు ఏవనేది ఆమెకే తెలియాలి. చాలా స్లిమ్ గా మారిపోయానని అవికా అనుకుంటుందేమోగానీ, ప్రేక్షకులు మాత్రం మునుపటి అవికాను చూడాలనే కోరుకుంటున్నారు.