ఫోటో స్టోరి: నిలువ‌వే హంస న‌డ‌క దానా

Update: 2020-10-16 02:30 GMT
హంసా నందిని.. అందాల ఆరబోతలో ఏమాత్రం త‌గ్గ‌ని బ్యూటీ. అందంతో హీటు పుట్టించ‌డం హంస హ్యాబిట్. 2004లో `ఒకటవుదాం` చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అధినేత.. ప్రవరాఖ్యుడు వంటి చిత్రాలతో హీరోయిన్ గా మెప్పించింది. అయితే స్టార్ డ‌మ్ అందుకోలేని ప‌రిస్థితిలో ప్రత్యేక పాత్రలకు.. ఐటెమ్‌ సాంగ్ లకే పరిమితమైంది. హీరోయిన్ గా రాణించలేకపోయినా ఐటెమ్‌ గర్ల్ గా ఓ రేంజ్ చూసింది. 2018లో `పంతం` చిత్రంలో న‌టించింది. ఆమె నటించిన చివరి చిత్రమిది. ఇక కెరీర్ కూడా జీరో అయ్యింది. అయితే సోష‌ల్ మీడియాల్లో మాత్రంల వ‌రుస ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది ఈ భామ‌.

మొన్న‌నే అదిరిపోయే వంట‌కానికి సంబంధించిన వీడియోని హంసానందిని షేర్ చేసింది. చికెన్ అండ్ ఎగ్ శాండివిచ్ ని రెడీ చేసి నోరూరించింది. అలాగే హెయిర్ క‌ట్ కి సంబంధించి సెలూన్ నుంచి వీడియోల్ని పోస్ట్ చేస్తూ వేడి పెంచుతోంది. లేటెస్టుగా మ‌రో హాట్ ఫోటోని హంస షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. థై స్లిట్ డ్రెస్ లో ఈ భామ హొయ‌లు వేడెక్కించాయి.

మొత్తానికి ఇలా వీడియోలు ఫోటోల‌తో ఇన్ స్టాలో అభిమానుల్ని భారీగానే పెంచుకుంది ఈ బ్యూటీ. హంసా నందినికి సోష‌ల్ మీడియాలో యాడ్ పోస్టింగుల రూపంలో ల‌క్ష‌ల్లో ఆదాయం ఆర్జిస్తోంద‌ట‌. అలాగే సినీఛాన్సుల‌ కోసం.. తమని తాము సర్వైవ్‌ చేసుకోవడం కోసం ఇలాంటి ఫోటో షూట్ లతో చెల‌రేగుతోంది. చాలా గ్యాప్ వ‌చ్చింది కాబ‌ట్టి స‌రైన ఆఫ‌ర్ కోసం ఈ భామ వేచి చూస్తోంది.
Tags:    

Similar News