సూటిగా రాణి పైకే హంస బాణం

Update: 2017-04-03 13:02 GMT
పూనే బ్యూటీ పూనం బర్టకే.. మన దగ్గర హంసా నందినిగా టాప్ రేంజ్ కి చేరిపోయింది. ఏళ్ల పాటు ఎదురుచూసిన బ్రేక్.. ఈమెకు మిర్చి చిత్రంలో ఐటెం సాంగ్ రూపంలో దక్కాక.. ఇక ఎక్కడా వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడీమె నెపోటిజం పై ముక్కు సూటిగా బోలెడు వ్యాఖ్యలు చేసేసింది.

'అసలేంటీ నెపోటిజం. మన దేశ సినీ పరిశ్రమలో ఇలాంటి వారసత్వం ఉందా అంటే ఉంది అనే చెబుతాను. కానీ ఇందులో ఏమైనా తప్పుందా అంటే మాత్రం లేదని చెబుతాను. పెద్దలు వారసత్వంగా తమ వృత్తి.. వ్యాపారం లాంటివాటిని తమ తర్వాతి తరాలకు అందించడం.. మన దేశంలో సాంప్రదాయం. తాము కష్టపడ్డామని.. పిల్లలను కూడా కష్టపడమని చెప్పకుండా అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. నేను ఈ స్థాయికి రావడానికి నేనూ బయటివ్యక్తిని కాబట్టే కష్టపడ్డాను. ఇన్ సైడర్ ను అయుంటే ఇంత కష్టం ఉండేది కాదని నాకు. అలాగని నా ప్రయాణం ఆగిపోయిందా? రేపు నా పిల్లలు ఈ ప్రొఫెషన్ ను ఎంచుకుంటే.. నా పరిచయాలు.. ఇన్ ఫ్లుయెన్స్ ఉపయోగించి వారికి సాఫీగా ఎంట్రీ అవకాశం కల్పిస్తాను కదా' అన్న హంస ఆ తర్వాత మరింతగా డోస్ పెంచింది.

'ఎవరైనా దీని గురించి దర్శకులను.. యాక్టర్లను విపరీతంగా విమర్శించడం సరికాదు. కొన్ని వారాలుగా ఈ హంగామా బాగా ఎక్కువైపోయింది. ఇలాంటి కష్టాలు నీ ఒక్కళ్లకే ఎదురయ్యాయా ఏంటి.. నువ్వు అంత కష్టపడకపోతే నీ ట్యాలెంట్ కు గుర్తింపు దక్కేదా. నువ్వు ఫెయిల్ అయితే.. అది వారసత్వం తప్పు కాదు.. దాదాపు నీ చేతకాని తనం అంతే. నెపోటిజం మన దేశ సినీ పరిశ్రమలో సహజం. మన దేశంలో అదేమీ తప్పు కాదు. రైటే' అనేసింది హంసా నందిని. హంస చేసిన కామెంట్స్ అన్నీ బాలీవుడ్ క్వీన్ కి గురి పెట్టినట్లుగా అనిపించడం లేదూ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News