కాంట్రవర్సీల అడ్డాగా చెప్పుకునే బిగ్ బాస్ షోలో వివాదాలు ఏ స్థాయిలో చెలరేగుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్నటివరకు హిందీ లోనే అనుకుంటే ఇప్పుడు కోలీవుడ్ - టాలీవుడ్ లో కూడా బిగ్ బాస్ బాగానే ఫేమస్ అయ్యింది. ఈ వివాదాల షో కరెక్ట్ గా తెలుగులోనే అంతగా ఏ గొడవా లేకుండా సాగిందని చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే ఇటీవల హిందీ బిగ్ బాస్ 11వ సీజన్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.
అయితే ఈ షోలో కంటెస్టెంట్ గా ఉన్న బాలీవుడ్ బుల్లితెర నటి హీనాఖాన్ సౌత్ హీరోయిన్స్ పై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సౌత్ హీరోయిన్స్ ప్రేక్షకులను ఆకర్షించడానికి ఎక్స్ పోజింగ్ ఎక్కువ చేస్తారని.. కావాలనే సైజులు పెంచుకుని అవి మొత్తం కనిపించేలా అసభ్యకరంగా బిహేవ్ చేస్తారని చెప్పింది. అంతే కాకుండా అమ్మడికి తెలుగులో మహేష్ - వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఆఫర్ కూడా వచ్చిందని చెప్పింది. కానీ తాను అందుకు ఒప్పుకోలేదట.
సౌత్ హీరోయిన్స్ అతిగా అందాలని ఆరబోస్తారని చేసిన వ్యాఖ్యలకు నెటిజన్స్ చాలా వరకు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో సౌత్ బ్యూటీ హన్సిక కూడా తనదైన శైలిలో కౌంటర్ చేసింది. బాలీవుడ్ లో నటించిన చాలా మంది స్టార్ హీరోయిన్స్ సౌత్ లో పనిచేశారన్న విషయం హీనా ఖాన్ కు తెలియదా? ఈ విధంగా వ్యాఖ్యలు చేసినందుకు ఆమె సిగ్గుపడాలని చెబుతూ.. జాగ్రత్తగా మాట్లాడాలని కొంచెం గట్టిగానే కౌంటర్ వేసింది. ఇక తాను సౌత్ హీరోయిన్ గా కొనసాగుతున్నందుకు చాలా గర్వపడుతున్నానని తన ట్విట్టర్ ద్వారా ఈ దేశముదురు భామ కామెంట్ చేసింది .