హన్సిక అందాల ఆరబోత... పెళ్ళైన అస్సలు తగ్గట్లేదుగా...

Update: 2023-01-16 13:30 GMT
దేశముదురు బ్యూటీ హన్సిక మోత్వాని ఈ మధ్యనే పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఒక పక్క ఆమెకు చేతిలో సినిమాలు తగ్గడంతో అందాల ఆరబోత మీద దృష్టి పెట్టిన హన్సిక మోత్వాని... తాజాగా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు కాక రేపుతున్నాయి.

కింద పొట్టి మిడ్డి ధరించి... పైన ఒక వైట్ షర్ట్ ధరించి ఒక పక్క ఎద అందాలు కనిపించేలా మరోపక్క తొడల అందాలు కనిపించేలా ఆమె చేస్తున్న హాట్ షో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హాట్ ఫోటోలు షేర్ చేయడమే కాదు క్రియేట్ యువర్ ఓన్ సన్ షైన్ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఆమె కాక రేపుతోంది.

ఈ మధ్యనే వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన ఆమె తన భర్తతో కలిసి అనేక దేశాల్లో పర్యటిస్తూ తన హనీమూన్ పీరియడ్ ని ఎంజాయ్ చేస్తోంది. తెలుగులో ఒకప్పుడు వరుస సినిమాలు చేసిన హన్సికకి ప్రస్తుతం సరైన ఆఫర్ లభించడం లేదు.

తెలుగు కంటే ఎక్కువగా తమిళ సినిమాల్లో ఆఫర్లు లభిస్తున్నా అక్కడ చేస్తున్న సినిమాలు కూడా వెంట వెంటనే రిలీజ్ అవ్వకపోవడంతో ఆమెకు పెద్దగా ఉపయోగపడడం లేదు. దీంతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు షేర్ చేసి ఫాలోవర్లు పెంచుకునే పనిలో పడినట్లుగా తెలుస్తోంది. కేవలం హన్సిక అని మాత్రమే కాదు ప్రస్తుతం క్రేజ్ తగ్గుతుంది అని భావిస్తున్న భామలు అందరూ సోషల్ మీడియానే తమ క్రేజ్ పెంచుకునేందుకు ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. ఎప్పటికప్పుడు తమ హాట్ ఫోటోలను తమ అప్డేట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉండడమే కాదు బోల్ట్ తరహా పాత్రలు పోషించడానికి కూడా మేము రెడీ అని గ్రీన్ సిగ్నల్స్ ఇస్తూ ఈ విధంగా తమ అందాలను ఆరబోస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News