హీరోయిన్ పెళ్లి తేదీలు ఫిక్స్.. వరుడి విషయంలో సస్పెన్

Update: 2022-11-01 03:30 GMT
దేశముదురు సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ హన్సిక మోత్వాని సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి పుష్కర కాలం పూర్తి అయినప్పటికి కూడా ఈ అమ్మడు ఇంకా తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు పెళ్లి తో వార్తల్లో నిలిచింది.

గతంలో ఈ అమ్మడు ఒక కోలీవుడ్‌ హీరోతో ప్రేమలో ఉందని.. త్వరలోనే ఆయన్ను పెళ్లి చేసుకోబోతుంది అంటూ తెగ ప్రచారం జరిగింది. కానీ ఆ హీరోతో బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత హన్సిక ప్రేమ గురించి కానీ పెళ్లి గురించి కానీ బలంగా వార్తలు కానీ.. పుకార్లు కానీ రాలేదు. ఎట్టకేలకు పెళ్లి వార్తలు వస్తున్నాయి.

హన్సిక పెళ్లి ఫిక్స్ అయ్యిందని తేదీలతో సహా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వరుడు ఎవరు అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. హీరోయిన్ హన్సిక పెళ్లి నిశ్చితార్థం ఇప్పటికే జరిగింది అనేది తమిళ మీడియాలో వస్తున్న వార్తల యొక్క సారాంశం గా తెలుస్తోంది.

డిసెంబర్‌ 2, 3, 4వ తారీకుల్లో జైపూర్ లో ప్రత్యేక వేదికలో పెళ్లి వేడుక జరుగబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. మూడు రోజుల డెస్టినేషన్‌ వెడ్డింగ్ లో సంగీత్‌ నుండి మొదలుకుని అన్ని హంగులు ఆర్భాటాలు ఉంటాయట. హన్సిక కుటుంబ సాంప్రదాయ రీతిలో పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారని అంటున్నారు.

గత కొన్నాళ్లుగా హన్సిక ప్రేమలో ఉందని.. అతడితోనే హన్సిక పెళ్లికి సిద్ధం అయ్యిందట. ఇంతకు దేశముదురు బ్యూటీని దక్కించుకుని ఆమె మెడలో తాళి కట్టబోతున్న ఆ దేశముదురు ఎవరో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Tags:    

Similar News