పూల్ సైడ్ క‌రోనా క‌వ్విస్తోంది బ్ర‌ద‌ర్

Update: 2020-03-16 08:15 GMT
యాపిల్ బ్యూటీ హ‌న్సిక కెరీర్ అయోమ‌యం గురించి తెలిసిందే. `గౌత‌మ్ నందా` త‌ర్వాత టాలీవుడ్ కి పూర్తిగా దూర‌మైంది. గ‌తేడాది `ఎన్టీఆర్ -క‌థానాయ‌కుడు` లో కామియో లో క‌నిపించినా ఆ సినిమా కూడా ఫ్లాప‌వ్వ‌డం తో త‌న పేరు అస‌లే ఎలివేట్ కాలేదు. అటుపై పూర్తిగా త‌మిళ‌ సినిమాల‌తోనే బిజీ అయింది. అయితే అమ్మ‌డికి ఇప్పుడు అక్క‌డా అవ‌కాశాలు తగ్గిపోయాయి. ప్ర‌స్తుతం మ‌హా అనే ఒకే ఒక్క సినిమా మిన‌హా మ‌రో ఛాన్స్ లేదు. ఇక హ‌నీ ఆశ‌ల‌న్నీ ఈ ఒక్క‌ సినిమాపైనే. ఇది లేడీ ఓరియేంటెడ్ మూవీ. ఇది సక్సెస్ అయినా క్రేజీ హీరోల స‌ర‌స‌న ఛాన్స్ అందుకుంటుందా అంటే అదీ గ్యారెంటీ లేదు.

దశాబ్ధం పాటు కోలీవుడ్ లో బిజీ నాయిక‌గా కొన‌సాగిన ఈ అమ్మ‌డు ఉన్న‌ట్టుండి ఇలా చ‌ల్ల‌బ‌డిపోవ‌డం వెన‌క కార‌ణ‌మేమిటో అర్థం కావ‌డం లేదు. హ‌న్సిక కోసం అక్క‌డ అభిమానులు ఏకంగా గుడులు...గోపురాలు క‌ట్టేసారు. మ‌రి ఇప్పుడా అభిమానం అవ‌కాశాలు తెచ్చి పెట్ట‌లేదు. అటు శింబుతో ప్రేమాయ‌ణం కూడా బెడిసి కొట్టిన త‌ర్వాత ఆపిల్ బ్యూటీ మ‌రోసారి అలాంటి ప్ర‌య‌త్నాలు చేయ‌నేలేదు. ఆ విష‌యాలు ప‌క్క‌న‌బెడితే తాజాగా అందాల హ‌న్సిక కొత్త స్టిల్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఈసారి పూల్ సైడ్ ట్రీట్ తో షేక్ చేస్తోంది. ఇదిగో ఇలా వ‌య్యారంగా అందాలు ఆరబోస్తూ ఉన్నా.. ఎందుక‌నో ముఖాన్ని దాచేసింది. స్విమ్మింగ్ పూల్ లో తేలుతున్న నెట్ లో చిక్కుకున్న తూనీగ‌లా క‌నిపిస్తోంది. ఎంతో వ‌య్యారంగా సేద తీరుతోంది. బ్లాక్ క‌ల‌ర్ బాట‌మ్... రెడ్ ఫ్లోర‌ల్ టాప్ ధ‌రించింది. ఆ ప‌క్క‌న చుట్టూరా స్కై బ్లూ యాంబియెన్స్ ఆక‌ట్టుకుంది. ముఖంపై మాత్రం రౌండ్ గా ఉన్న‌ పిట్ట‌ల దొర హ్యాటు పెట్టుకుని వేషం వేస్తోందిలా. పై నుంచి సూర్యుడు ప్ర‌తాపం చూపిస్తుండ‌టం తో... వాట‌ర్ కాంతివంతంగా మెరుస్తోంది. ఆ మెరుపుల మ‌ధ్య‌ యాపిల్ అందం నిగ‌నిగ‌లాడుతోంది. ప్ర‌స్తుతం కొవిడ్-19 వైర‌స్ భార‌త్ ని ఊపేస్తుంటే ఈవిడేమిటి మ‌రీ ఇంత ధీమాగా అనిపిస్తోందా? క‌రోనా నుంచి దూర‌మ‌వ్వాలంటే ఇలా చేయాల‌నే దీని ఉద్ధేశం ఏమో! ఆ ముఖంపై ఆ హ్యాట్ స్టైల్ చూసిన నెటిజ‌నులు క‌రోనా ని ఇలా ఆపేద్దామ‌నేనా? అంటూ ఫ‌న్నీ కామెంట్లు గుప్పిస్తున్నారు.
Tags:    

Similar News