కుర్ర డైరెక్టర్.. హీరోయిన్లను భలే పట్టుకొస్తాడే

Update: 2017-06-14 13:26 GMT
ఒక్కో దర్శకుడికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. కొంతమంది దర్శకులు హీరోయిన్లను భలే ఎలివేట్ చేస్తారని.. అందమైన భామల్ని సెలక్ట్ చేసుకుని.. వాళ్లను తమదైన శైలిలో వెండితెరపై ప్రెజెంట్ చేసి.. తమ ప్రత్యేకతను చాటుకుంటారని పేరుంటుంది. యువ దర్శకుడు హను రాఘవపూడి ఈ కోవలోకే వస్తాడు. అతను ప్రస్తుతం మూడో సినిమా చేస్తున్నాడు. ఈ మూడు సినిమాల్లోనూ హీరోయిన్లు ప్రత్యేక ఆకర్షణ అనడంలో సందేహం లేదు. తొలి సినిమా ‘అందాల రాక్షసి’లో లావణ్య త్రిపాఠి ఎంత బాగా కనిపించిందో.. ఆమెను చూసి ఎంతమంది కుర్రాళ్ల గుండెలు లయ తప్పాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమెను ఏరి కోరి కథానాయికగా ఎంచుకుని తెరమీద చాలా అందంగా ప్రెజెంట్ చేశాడు హను. ఈ సినిమా తర్వాత లావణ్య బాగా బిజీ అయిపోయింది.

ఇక హను రెండో సినిమా ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’తో మెహ్రీన్ కథానాయికగా పరిచయమైంది. ఆ అమ్మాయికీ మంచి పేరొచ్చింది. అవకాశాలు వెల్లువెత్తాయి. దాదాపు అరడజను సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయిప్పుడు. ఇక హను లేటెస్ట్ మూవీ ‘లై’తో తెలుగు తెరకు పరిచయమవుతున్న మేఘా ఆకాశ్ ఇప్పటికే టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అయిపోయింది. ఆల్రెడీ గౌతమ్ మీనన్ ఆమెతో సినిమా చేశాడు. దీంతో ఆమెపై చాలామంది కళ్లు పడ్డాయి. ఇప్పుడు హను కూడా తనదైన శైలిలో మేఘాను ప్రెజెంట్ చేయబోతున్నాడని.. ‘లై’ ప్రోమోస్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే నితిన్ చేయబోయే మరో సినిమాలోనూ మేఘానే కథానాయికగా ఎంచుకున్నట్లు చెబుతున్నారు. మరోవైపు రామ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాలోనూ మేఘానే హీరోయిన్ గా ఎంపికవడం విశేషం. మొత్తానికి హను చేతిలో పడ్డ హీరోయిన్ దశ తిరిగిపోవడం ఖాయం అనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News