‘అందాల రాక్షసి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన హను రాఘవపూడి ప్రశంసలూ అందుకున్నాడు. అలాగే విమర్శలూ తీసుకున్నాడు. మొత్తానికి తెలుగు సినిమాపై తనదంటూ ఓ ముద్ర అయితే వేశాడు. తొలి సినిమా రిలీజైన మూడున్నరేళ్లకు కానీ.. రెండో సినిమా చేయలేకపోయాడు హను. అతడి కొత్త సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి టాక్ కూడా సంపాదించుకుంది. ఈ రోజు మార్నింగ్ షో పడగానే టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయాడు హను. కొత్తదనానికి కొత్తదనం ఇస్తూనే కమర్షియల్ గానూ వర్కవుటయ్యే సినిమాలు తీయగలనని ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’తో రుజువు చేసుకున్నాడు హను.
దీంతో సాయంత్రానికల్లా హను ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉండి ఉంటుందనడంలో సందేహం లేదు. ఇంతకుముందు వర్కవుట్ కాని సినిమాలు కూడా ఇప్పుడు తెరమీదికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో ‘కవచం’ కూడా ఒకటి కావచ్చు. ‘అందాల రాక్షసి’ తర్వాత హను చేయాలనుకున్న సినిమా ఇదే. రానాను హీరోగా అనుకున్నాడు. రానా తండ్రి సురేష్ బాబే నిర్మించాల్సింది. దాదాపు ఒకటిన్నర ఏడాది ఈ సినిమా మీద పని చేశాడు హను. రానా కూడా బాగానే ఇంప్రెస్ అయ్యాడు. కానీ బాహుబలి’ పనిలో పడి దీన్ని పక్కనబెట్టేశాడు. ఇప్పుడు హను తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అతడి స్టామినాపై ఏమైనా సందేహాలుంటే అవి తొలగిపోయే ఉంటాయి. రానా కొంచెం ఖాళీ అయ్యాడంటే సినిమా తెరమీదికి వచ్చేస్తుంది.